Arvind Kejriwal: ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో అత్యవసర విచారణకు అప్పీల్!!
దేశ వాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైన నేపథ్యంలో ఆయన తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని, తనుకు వెంటనే ఈ కేసు నుంచి ఉపశమనం కల్పించాలని అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు.
సుప్రీంలో సవాల్ చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఈ మేరకు సుప్రీం లో అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ పిటీషన్ దాఖలు చేశారు . ఢిల్లీ హైకోర్టులో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, తన అరెస్టును రద్దు చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన క్వాష్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసిన తర్వాత, ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ కోసం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు.

కేజ్రీవాల్ పిటీషన్ అత్యవసరంగా విచారించాలని కోరిన న్యాయవాదులు
దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఈడీ అరెస్ట్ ను రద్దు చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన న్యాయవాదులు పంపిన ఈ మెయిల్ ను వెంటనే పరిశీలిస్తానని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ, షాదన్ ఫరాసత్‌లు సీజేఐ ముందు అరవింద్ కేజ్రివాల్ పిటిషన్ కు సంబంధించి మౌఖిక ప్రస్తావన తెచ్చారు.
త్వరగానే కేజ్రీవాల్ పిటీషన్ పరిశీలిస్తామన్న సుప్రీం ధర్మాసనం
సింఘ్వీ మాట్లాడుతూ, నిరాధారమైన పత్రాల ఆధారంగా కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని, ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి అని అందుకే అత్యవసర జాబితా కోసం ఈ మెయిల్ చేశానని చెప్పారు. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ ఆ ఈ మెయిల్ ను పరిశీలిస్తానని బదులిచ్చారు.
సుప్రీంలో ఏం జరగబోతుంది?
మరి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ పై ఏం చెప్పబోతోంది? అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా? లేక ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తుందా? సుప్రీంకోర్టులో అయినా అరవింద్ కేజ్రివాల్ కి ఊరట దక్కుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications