ఆప్ పతనం ఆరంభం.. కేజ్రివాల్ చేసిందిదే- మాజీ సహచరుడి కామెంట్స్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన ఓటమి బీజేపీతో పాటు అరవింద్ కేజ్రివాల్ ఒకప్పటి సహచరులందరికీ సంతోషాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో అరవింద్ కేజ్రివాల్ సామాజిక కార్యకర్త అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కుమార్ విస్వాస్, ప్రశాంత్ భూషణ్ వంటి ఎందరో ఆయనకు సన్నిహితులయ్యారు. కానీ వీరందరినీ వదిలించుకుని రాజకీయాల్లో మునిగిపోయిన కేజ్రివాల్ ఇన్నాళ్లకు ఓటమితో తిరిగి ఒంటరయ్యారు.
ఈ నేపథ్యంలో కేజ్రివాల్ పార్టీ ఆప్ కు ఎదురైన దారుణ పరాజయంపై వారంతా ఇప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పటికే అన్నా హజారే కేజ్రివాల్ తమ మాట విని ఉంటే ఈ పరిస్దితి ఎదురయ్యేది కాదని తాజాగా స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కేజ్రివాల్ మరో మాజీ సహచరుడు, సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఆయన కేజ్రివాల్, ఆప్ ను ఉద్దేశించి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎదురైన తొలి ఓటమి ఆ పార్టీ పతనానికి ఆరంభం అంటూ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.
ముఖ్యంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఏర్పాటైన పార్టీ పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన పార్టీని అరవింద్ వేగంగా సుప్రీమో డామినేట్, పారదర్శకత లేని అవినీతి పార్టీగా మార్చారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. అది లోక్‌పాల్‌ను అమలు చేయలేదని, దాని స్వంత లోక్‌పాల్‌ను సైతం తొలగించిందని గుర్తుచేశారు.
Kejriwal is largely responsible for AAP’s Delhi debacle. A party formed for alternative politics which was supposed to be transparent, accountable & democratic was quickly transformed by Arvind into a supremo dominated, non transparent & corrupt party which didn’t pursue a Lokpal…
— Prashant Bhushan (@pbhushan1) February 8, 2025
ఆప్ ఢిల్లీ పరాజయానికి కేజ్రీవాల్ దే బాధ్యత అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఏర్పాటైన పార్టీ పారదర్శకంగా, జవాబుదారీగా , ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన పార్టీని, లోక్‌పాల్‌ని కొనసాగించని, దాని స్వంత లోక్‌పాల్‌ను తొలగించిన సుప్రీమో డామినేట్, పారదర్శకత లేని, అవినీతి పార్టీగా అరవింద్ వేగంగా మార్చారన్నారు. అతను తన కోసం 45 కోట్ల షీష్ మహల్‌ను నిర్మించుకున్నాడని, విలాసవంతమైన కార్లలో ప్రయాణించడం ప్రారంభించాడని ఆరోపించారు.
ఆప్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీల 33 వివరణాత్మక విధాన నివేదికలను ఈ సందర్బంగా ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్ కు జత చేశారు. సమయం వచ్చినప్పుడు పార్టీ అనుకూలమైన విధానాలను అవలంబిస్తుందని, బురదజల్లడం, ప్రచారం చేయడం ద్వారా రాజకీయాలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆప్ అంతానికి నాంది అన్నారు.












Click it and Unblock the Notifications