నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా అరవింగ్ పనగరియా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నీతి ఆయోగ్‌కు సభ్యులను సోమవారం నియమించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్ధానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సంస్ధకి ఉపాధ్యక్షుడిగా అరవింగ్ పనగరియా నియమితులయ్యారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, రాధామోహన్ సింగ్ నియమితులయ్యారు. శాశ్వత సభ్యులుగా వివేక్ దెబ్రాయ్, వీకే సారస్వత్‌లను నియమించారు.

ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థ మనుగడలోకి వచ్చింది. ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అని పేరు పెడుతూ గురువారంనాడు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ అనే పేరు పెట్టడం కొత్త పంథాలో సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రారంభంగా చెబుతున్నారు. కొత్త సంస్థ ఏలా ఉండాలనే విషయంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆ మధ్య ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేశారు.
అధికార వికేంద్రీకరణ జరగాలని సమావేశంలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. తన 65 ఏళ్ల చరిత్రలో ప్రణాళికా సంఘం 12 పంచవర్ష ప్రణాళికలను, ఆరు వార్షిక ప్రణాళికలను రూ.200 లక్షల కోట్లతో రూపొందించింది.












Click it and Unblock the Notifications