వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారూక్ ఖాన్ కు షాక్: మూడోసారి ఆర్యన్ ఖాన్ కు నో బెయిల్; టెన్షన్ లో షారూక్ కుటుంబం, ఫ్యాన్స్

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు మరోమారు కోర్టు షాక్ ఇచ్చింది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది ముంబై ప్రత్యేక ఎన్పిడిఎస్ కోర్టు. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు, e కేసులో ఇతర నిందితులు అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా కు ముంబైలోని ప్రత్యేక ఎన్పిడిఎస్ కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. ప్రత్యేక న్యాయమూర్తి వివి పాటిల్ ఈ మేరకు తీర్పును ప్రకటించారు.

 మూడో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరణ

మూడో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరణ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 2 వ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8వ తేదీ నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. కానీ ఆర్యన్ ఖాన్ కు కోర్టు పదేపదే షాక్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మరోమారు కోర్టులో చుక్కెదురైంది. ఆర్యన్ ఖాన్ తరపున వాదించిన న్యాయవాదులు పదేపదే బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించినప్పటికీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురి అవుతూ వచ్చింది .

 ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు : కోర్టులో ఆసక్తికర వాదనలు

ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు : కోర్టులో ఆసక్తికర వాదనలు

ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని,అరెస్ట్ చేసిన సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేవించి లేరని, క్రూయిజ్ షిప్ పార్టీకి ఆర్యన్ ఖాన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే వెళ్ళారని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది వాదించారు. అంతే కాదు వాట్సప్ చాటింగ్ ల ఆధారంగా డ్రగ్స్ చాట్ అని నిర్ధారించలేమని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ఎన్సీబీ మాత్రం తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కోర్టు ముందు తాము సేకరించిన ఆధారాలను ఉంచారు.

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ వాదన ఇలా ...

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ వాదన ఇలా ...

ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ కు గ్లోబల్ డ్రగ్స్ ముఠా లింకులు ఉన్నాయని, ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాటింగ్ లో అనేక ఆసక్తికరమైన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, భారీ పరిమాణంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించామని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అంతేకాదు మరో సంచలన విషయాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీకి ఇప్పుడిప్పుడే వస్తున్న ఓ కొత్త హీరోయిన్ తో డ్రగ్స్ గురించి వాట్సప్ చాట్ చేసినట్లుగా ఎన్సీపీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

 ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్ .. కోర్టు ముందుంచిన ఎన్సీబీ

ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్ .. కోర్టు ముందుంచిన ఎన్సీబీ

ఈ చాటింగ్ కి సంబంధించిన సాక్ష్యాలను సైతం వారు కోర్టు ముందు దాఖలు పరిచారు. దీంతో ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని, బెయిలు మంజూరు చేయొద్దని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాదన వినిపించగా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి ఈ కేసులో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న ఉత్కంఠ చోటుచేసుకోగా, కోర్టు మరోమారు ఆర్యన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది. రేపటి వరకు ఆర్యన్ ఖాన్ ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో ఆర్యన్ ఖాన్ తీవ్ర దుఃఖంలో ఉన్నారని సమాచారం.

 బెయిల్ పిటిషన్ పై బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు

బెయిల్ పిటిషన్ పై బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు


ముచ్చటగా మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించడం తో ఒక్కసారిగా ఆయన కుటుంబం షాక్ కు గురయ్యారు. గతంలోనే గౌరీ ఖాన్ కొడుక్కి బెయిల్ రాకపోవటంతో తీవ్రంగా దుఃఖించిన విషయం తెలిసిందే. మూడో సారి కచ్చితంగా బెయిల్ వస్తుందని అంతా ఊహించిన తరుణంలో మరోమారు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై, ఆర్యన్ ఖాన్ తో పాటుగా అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాల బెయిల్ పిటిషన్ లపై బొంబాయి హైకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు భావిస్తున్నారు .కోర్టు ఆదేశాలను స్వీకరించిన తర్వాత బెయిల్ పిటిషన్ తిరస్కరించడానికి గల కారణాన్ని గుర్తించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని నిందితుల తరపు న్యాయవాదులు వెల్లడించారు.

 షాక్ లో షారూక్ ఖాన్ కుటుంబం .. సెన్సేషన్ గా మారిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు

షాక్ లో షారూక్ ఖాన్ కుటుంబం .. సెన్సేషన్ గా మారిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు


మరోమారు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించడంతో షారుక్ ఖాన్ అభిమానులు, ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షారూక్ ఖాన్ ఇంటి వద్ద ఆయనకు మద్దతుగా చేరిన ఫ్యాన్స్ తాజా కోర్టు నిర్ణయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కావాలని ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు ఇరికిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారాయి. మరోపక్క శివసేన నేత, మంత్రి కిషోర్ తివారీ ఈ కేసుపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇది కేంద్రం ఆదేశాలతో కేంద్ర సంస్థ కావాలని చేస్తున్న పని అని ఆరోపించారు. ఇప్పటికే కుమారుడి అరెస్టుతో తీవ్ర ఆవేదనతో ఉన్న గౌరీఖాన్ కోర్టు తాజా నిర్ణయంతో మరింత దుఃఖంలో ఉన్నట్లుగా సమాచారం. ఏదేమైనా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు చాలా మలుపులు తిరుగుతూ, అనూహ్యంగా కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తూ అటు బాలీవుడ్ వర్గాలలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

English summary
Mumbai NPDS special court has refused to grant bail to Shah Rukh Khan's son Aryan Khan in drugs case, Gave a shock to Shahrukh Khan. Shah Rukh's family and fans are in tension after Aryan Khan was denied bail for the third time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X