వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీపై పోస్టర్లు: 17 మంది అరెస్ట్ -నన్ను కూడా చేయండంటూ రాహుల్ గాంధీ సవాల్

|
Google Oneindia TeluguNews

కరోనా పరిస్థితుల నిర్వహణలో విఫలమైన కేంద్ర సర్కారు.. జనం నోళ్లు మూయించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. వ్యాక్సిన్ల సేకరణ కంటే విమర్శకుల భరతం పట్టడానికే మోదీ ప్రభుత్వం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. మోదీ తీరును ప్రశ్నిస్తూ పోస్టర్లు వేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు..

''మోదీజీ.. మా పిల్లలకు దక్కాల్సిన టీకాలను మీరు విదేశాలకు ఎందుకు పంపించారు?'' అని రాసున్న పోస్టర్లు ఇటీవల ఢిల్లీలో సంచలనం రేపాయి. వాటిపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు.. వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. అంతేకాదు..

రఘురామ వివాదం: జగన్‌పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్‌లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందోరఘురామ వివాదం: జగన్‌పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్‌లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందో

as 17 arrested for poster critical of PM Modi, Rahul Gandhi tweets it, says arrest me too

కరోనా సంబంధిత విషయాల్లో కేంద్రాన్ని విమర్శిస్తూ ఎవరైనా పోస్టులు, పోస్టర్లు వేస్తే, వాటిపై ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. పోస్టర్లు వేసిన వ్యక్తుల అరెస్టులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ పోలీసులకు ఆయన సవాలు విసిరారు. మోదీపై విమర్శల పోస్టర్ షేర్ చేస్తున్నానని, కాబట్టి తనను కూడా అరెస్టు చేయాలని రాహుల్ సవాలు విసిరారు.

ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్రం మూడో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోందని చెప్పుకుంటున్నప్పటికీ, శనివారం దాకా అంతా కలిపి 18.22కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులను అందించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలకు 51 డోసుల టీకాలను పంపుతామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ల కొరతపై కాంగ్రెస్ సహా 12 ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

English summary
as many as 17 people have been arrested in Delhi in connection with posters criticising Prime Minister Narendra Modi over India's vaccine shortage. Congress leader Rahul Gandhi tweeted the poster critical of the Prime Minister with the caption, "Arrest me too". Senior Congress leaders like Pawan Khera and Jairam Ramesh also joined in."Modi Ji, you sent abroad the vaccines meant for our children," the poster read.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X