హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్: ఎందుకంటే?
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక ప్రజల తరపున సినీ హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. కర్ణాకట, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం నెలకొన్న నేపథ్యంలో కర్ణాటకలో సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని కన్నడిగులు అడ్డుకోవడంపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు.
'దశాబ్దాలుగా కర్ణాటక-తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదాన్ని పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలను, పార్లమెంటు సభ్యులను, నేతలను ప్రశ్నించకుండా.. నిస్సహాయులైన సామాన్యులను, కళాకారులను అడ్డుకోవడం సరికాదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను ప్రశ్నించండి. కన్నడ పౌరుడిగా.. కర్ణాటక ప్రజల తరపున నేను నీకు క్షమాపణలు చెబుతున్నా సిద్ధార్థ్' అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'చిన్నా' సినిమా గురువారం విడుదలైంది. ఈ క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. అయితే, కార్యక్రమం ప్రారంభం కాగానే కొందరు కన్నడ నిరసనకారులు అక్కడికి చేరుకుని ప్రెస్ మీట్ ఆపేయాలని సిద్ధార్థ్‌కు సూచించారు. లేదంటే కావేరి ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్ధార్థ్‌ను కోరారు.
Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0
— Prakash Raj (@prakashraaj) September 28, 2023
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి నది జలాల విషయంలో వివాదం నెలకొన్న వేళ తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించడంపై అక్కడికి వచ్చిన కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నిలిపేసి.. అక్కడ్నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేం లేక సిద్ధార్థ్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొందరు సిద్ధార్థ్‌కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌కు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications