2024లో యోగినే ప్రధాని: గోరఖ్‌పూర్ వీధుల్లో మారుమోగుతున్న నినాదాలు..

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ను 'భవిష్యత్తు ప్రధాని' అంటూ అప్పుడే ఆయన మద్దతుదారులు కీర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఈ తరహా ప్రచారం భారీగానే జరుగుతోంది.

సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి యోగి శనివారం నాడు గోరఖ్ పూర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు వేలాదిగా కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు తరలివస్తున్నారు. ఆయన అభిమానుల్లో ఎవరిని కదలించినా.. భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి యోగినే అని వారు అభిప్రాయపడుతుండటం గమనార్హం. 'భవిష్యత్తు ప్రధాని యోగి' అంటూ ఆయన రాకను స్వాగతిస్తూ గోరఖ్ పూర్ వీధుల్లో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

As Adityanath heads to Gorakhpur, supporters raise 'Yogi as PM in 2024' slogan

యోగి రాకతో గోరఖ్ పూర్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోగి సమర్థవంతమైన పనిమంతుడు కావడం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, 2024లో యోగియే దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యోగి స్వస్థలమైన పూర్వాంచల్ బాగా వెనుకబడిన గ్రామం కావడంతో.. ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఇక ఆ గ్రామం అభివృద్ది చెందుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Newly appointed Uttar Pradesh Chief Minister Yogi Adityanath will be making his maiden visit to Gorakhpur today.Ahead of the Chief Minister's visit, the wish of his supporters to see 'Yogi as PM in 2024' rose to a clamour.
Please Wait while comments are loading...