తెలంగాణ సీఎం, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగి ?, చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే !
తెలంగాణలో 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (టీఆర్ఎస్) ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. చింత చిచ్చినా పులుపుచావలేదు అనే సామత లాగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పాతపాటే పాడుతోంది. సీఎం ఎవరు ? అనే విషయంలో అందరిని కాంగ్రెస్ హైకమాండ్ టెన్షన్ పెడుతోంది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఇలాగే చేస్తోంది అని మరోసారి వెలుగు చూసింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ముందుగానే ఊహించిన ఆపార్టీ పెద్దలు ఇంతకాలం చర్చలు జరపకుండానే ఉంటారా ? అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పూర్తి మెజారిటీ వచ్చినా సీఎం పేరు ప్రకటించకుండా ఆలస్యం చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

ప్రజలు మద్దతు ఇవ్వకుండా, ఎమ్మెల్యేలను గెలిపించకుండా ఉంటే మమ్మల్ని ఆదరించండి అని తిరిగే కాంగ్రెస్ పార్టీ తరువాత మెజారిటీ వచ్చిన తరువాత ఇలాంటి పనులు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలు గెలిపిచినా కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీపీ. షుగర్ లెవల్స్ పెరిగిపోయేలా టెన్షన్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తరువాత సిద్దరామయ్యను సీఎంగా, డీసీఎంగా డీకే శివకుమార్ ను నియమించిన విషయం తెలిసిందే.

కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను అదే పదవిలో కొనసాగించి డీసీఎం పదవి ఇచ్చినట్లు రేవంత్ రెడ్డిని టీపీసీ అధ్యకుడిగా కొనసాగించి డీసీఎం పదవి ఇవ్వాలని, మాలో ఎవరికైనా సీఎం పదవి ఇవ్వాని నలుగురు తెలంగాణలోని సీనియర్ నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ కు మనవి చేశారని తెలిసింది. అయితే టీపీసీసీ అధ్యక్షుడి పదవితో పాటు డీసీఎంగా ఉండటానికి రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా ? అనే ప్రశ్న మొదలైయ్యింది.

లేదంటే రెండున్నరేళ్లు ఒకరు, రెండున్నరేళ్లు ఒకరు ఫార్ములా కూడా తెరమీదకు వచ్చిందని, తెలంగాణకు చెందిన ఐదు మంది సీనియర్ నాయకులతో ఢిల్లీలో విడివిడిగా చర్చలు జరపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది. తెలంగాణ నాయకులను ఏకతాటి మీదకు తీసుకువచ్చే భాద్యను డీకే శివకుమార్ అప్పగించారని సమాచారం. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, డీకే శివకుమార్ చర్చించారు.

మల్లికార్జున్ ఖార్గే, డీకే శివకుమార్ తరువాత కేసీ వేణుగోపాల్ కూడా వీరితో చర్చించారని సమాచారం. కర్ణాటక ఫార్ములాలాగే, ఆ రాష్ట్రంలో మంత్రి పదువులు కేటాయించినట్లు తెలంగాణలో కూడా మంత్రి పదువులు ఆశించేవారికి లోక్ సభ ఎన్నికల్లో ఇన్ని సీట్లు గెలవాలి అనే టాస్క్ కూడా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టార్గెట్ పెట్టే అవకాశం ఉందని తెలిసింది. మంగళవారం కూడా తెలంగాణ సీఎం పేరు ప్రకటించే అవకాశం లేదని కర్ణాటకకు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications