Chandrayaan 3: చంద్రుడిపై ఉదయించిన సూర్యుడు.. విక్రమ్, ప్రగ్యాన్ నిద్రలేస్తాయా..!
ఆగస్ట్ 23 చంద్రుడిపై భారత్ పంపిన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన సంగంతి తెలిసిందే. ఆ తర్వాత రోవర్ ప్రగ్యాన్ బయటకు వచ్చి అనే విషయాలను ఇస్త్రో శాస్రవేత్తలకు పంపింది. దాదాపు 14 రోజుల పాటు పని చేసిన విక్రమ్, ప్రగ్యాన్ పనిచేసిన తర్వాత వాటిని నిద్రాణావస్థలోకి పంపారు. ప్రస్తుతం విక్రమ్, ప్రగ్యాన్ నిద్రాణావస్థలోనే ఉన్నాయి. చంద్రుడిపై ఒక పగలు భూమి మీద 14 రోజులతో సమానం. చంద్రుడిపై సూర్యాస్థమయం తర్వాత ల్యాండర్, రోవర్ నిద్రలోకి వెళ్లాయి.
ఇప్పుడు చంద్రుడిపై సూర్యుడు ఉదయించాడు. దీంతో మరోసారి ల్యాండర్, రోవర్ ను పని చేయించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. విక్రమ్, ప్రగ్యాన్ ఉన్న సోలర్ ప్లేట్స్ ప్రస్తుతం ఛార్జింగ్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం అవి పూర్తిగా ఛార్జింగ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. చంద్రుడిపై రాత్రిపూటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. అక్కడ మైనస్ 120 నుంచి 180 ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఆ సమయంలో ల్యాండర్, రోవర్ పని చేయలేవు.

అందుకే 14 రోజుల పాటు వాటిని నిద్రాణావస్థలోకి పంపారు. ప్రస్తుతం సూర్యుడు ఉదయించడంతో విక్రమ్, ప్రగ్యాన్ నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టం బాగుండి ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా మన చేతికి అందుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఒక చంద్రుని పగటిపూట (సుమారు 14 భూమి రోజులు) పనిచేసేలా మిషన్ రూపొందించబడినప్పటికీ, చంద్రునిపై సూర్యుడు మళ్లీ ఉదయించినప్పుడు అవి మళ్లీ జీవం పోసుకుంటాయని ఇస్రో ఆశగా ఉంది.
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్' అని పేరు పెట్టారు. చంద్రుని దక్షిణ ధ్రువం ల్యాండింగ్ సాధించడానికి ఒక సవాలుగా ఉన్న భూభాగం, అందుకే భారతదేశానికి ముందు ఏ దేశం ఈ ప్రాంతంలో చంద్ర-ఆధారిత అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయలేకపోయింది. 'సాఫ్ట్ ల్యాండింగ్' అనేది చంద్రుని ఉపరితలంపై తాకిన మాడ్యూల్ వేగాన్ని తగ్గించి, నిర్దిష్ట ప్రదేశంలో ల్యాండింగ్ చేయడానికి అనుకూలంగా ఉందో లేదో తనిఖీ చేసే ప్రక్రియను సూచిస్తుంది.












Click it and Unblock the Notifications