25 ఏళ్లుగా ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తున్నాం, నిషేధం బాధ కలిగించింది: ఆసియానెట్ ఎడిటర్..
పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక ఆందోళనల్లో అసత్య వార్తలు ప్రసారం చేశారని ఆసియానెట్, మీడియా వన్ సంస్థలపై కేంద్ర సమాచార శాఖ 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆసియానెట్ ఎడిటర్ ఎంజీ రామచంద్రన్ స్పందించారు. గత 25 ఏళ్లుగా ఉన్నత ప్రమాణాలతో ఆసియానెట్ పనిచేస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. కానీ శుక్రవారం సమాచార, ప్రసార శాఖ తీసుకున్న నిర్ణయంతో కలచివేసిందని పేర్కొన్నారు. 25 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆయన వివరించారు. కానీ ఐ అండ్ బీ ఆదేశంతో చానెల్ ప్రసారాలు నిలిపివేసి, విధులనుంచి తప్పుకున్నామని తెలిపారు.

అతీతులం కాదు.. కానీ..
దేశంలో ప్రతీ ఒక్కరు, ఒక సంస్థ.. చట్టం, న్యాయం ముందు అందరూ సమానమేనని రామచంద్రన్ తెలిపారు. అందుకు మేం అతీతులం ఏం కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా కూడా అలానే పనిచేస్తుందని... ఆసియానెట్ కూడా అలా వ్యవహరించిందని చెప్పారు. అయితే ఢిల్లీ ఆందోళనలో నెలకొన్న అభ్యంతరాలను తాము కూడా అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు. కానీ ఘటనకు సంబంధించి సమాచార, ప్రసారాల శాఖ తమను సంప్రదించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
నిబంధనల మేరకే..
ప్రజాస్వామ్య దేశంలో నాలుగో స్తంభమైన మీడియా పనిచేస్తోందని.. ఆసియానెట్ కూడా నిబంధనల మేరకు పనిచేస్తోందని చెప్పారు. తమ చానెల్‌పై నిషేధం తొందరపాటు చర్య అయి ఉంటుందన్నారు. దీనిపై సమాచార, ప్రసారాల శాఖ, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిర్ణయాన్ని సమీక్షించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ ఆసియానెట్ మాత్రం తన పరిధిలో పనిచేస్తుందని.. వీక్షకులు కచ్చితమైన, నిష్పాక్షిపాతమైన సమాచారం అందజేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ కారణం
సీఏఏ ఆందోళనతో ఆసియానెట్ చానెల్ మృతుల సంఖ్యను ఎక్కువ చూపిందని సమాచార, ప్రసారాల శాఖ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 48 గంటలపాటు బ్యాన్ విధించడంతో.. ఇవాళ ఎడిటర్ రామచంద్రన్ స్పందించారు. తమ చానెల్‌పై నిషేధం గురించి ఒక నోట్ విడుదల చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications