జుబిన్‌ గార్గ్‌ను చంపింది వీళ్లే.. అస్సాం సీఎం బాంబ్!

ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ సింగపూర్ పర్యటనలో మృతి చెందడంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. జుబిన్ గార్గ్ మరణం కేవలం ఒక ప్రమాదం కాదని.. ఇది ఒక హత్య అని ఆయన తేల్చి చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అస్సాం అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ కేసు గురించి కీలక వివరాలను వెల్లడించారు. "జుబిన్ మరణం మొదటి రోజు నుంచే హత్య కేసు అని మాకు తెలుసు. ఈ కేసులో నిందితులు శ్యామ్‌కాను మహంత, సిద్ధార్థ్ శర్మ, అమృతప్రభా మహంత, శేఖర్ జ్యోతి గోస్వామి ప్రస్తుతం జైలులో ఉన్నారు." అని ఆయన తెలిపారు.

ఈ విషయంలో కేంద్రం నుంచి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి అనుమతి అందిన తర్వాత, రాష్ట్రం బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద ఈ కేసును విచారిస్తోందని వెల్లడించారు. "జుబిన్ పట్ల మాకు భావోద్వేగాలు ఉన్నాయి, అందుకే మేము జుబిన్ గార్గ్ హత్యపై విచారణ జరుపుతున్నాము," అని ఆయన అన్నారు.

Assam CM Drops Bombshell Zubeen Garg Death Was Murder Not Accident

ఈ మరణాన్ని "హత్య"గా అనుమానించడానికి గల కారణాలను సీఎం హిమంత ఇలా వివరించారు. "జుబిన్ మరణించిన వెంటనే మాకు ఏదో తప్పు జరిగింది అని అనిపించింది. అందుకే మేము బీఎన్‌ఎస్ సెక్షన్ 61 (క్రిమినల్ కుట్ర), 105 (నరహత్య), 106 (అతి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా మరణం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. అస్సాం పోలీసులకు ఇది "స్పష్టమైన హత్య" అని మొదటి దశలోనే నమ్మకం కలిగిందని, అందుకే రెండు రోజుల్లోపే అస్సాం ప్రభుత్వం కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసి, నేరం కింద సెక్షన్ 103 (హత్యకు శిక్ష) ను చేర్చాలని కోరింది" అని సీఎం తెలిపారు.

కేంద్రం అనుమతి.. విచారణ పురోగతి
"మరొక దేశంలో ఏదైనా సంఘటన జరిగితే, బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 208 ప్రకారం, దర్యాప్తు సంస్థ హోం మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి లేకుండా కోర్టు కేసును పరిగణనలోకి తీసుకోదు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి కారణంగా 10 నుంచి 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి, డిసెంబర్ 10 లోపు చార్జిషీట్ దాఖలు చేయగలం" అని సీఎం హిమంత వెల్లడించారు.

విపక్షాలపై సీఎం విమర్శలు
సీఎం హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియాలో (X హ్యాండిల్) ఒక వీడియోను పంచుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు."అస్సాంలో ప్రతిపక్షాలు చేస్తున్న హాస్యాస్పద వ్యాఖ్యలు వింటే, వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం జుబిన్ గార్గ్ హంతకులకు వకాల్తా పుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. వారి దృష్టి ఎక్కడో ఉంది, కానీ లక్ష్యాలు మరొకటి" అని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+