6.4 భూకంప తీవ్రతతో వణికిన రాష్ట్రం: మంత్రి బంగళా సైతం దడదడ
గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ సారి మాత్రం 6.4 తీవ్రతతో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను స్వయంగా భూకంప తీవ్రతను అనుభవించినట్లు అస్సాం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఈ ఉదయం 7:51 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గువాహటికి 97, తేజ్‌పూర్‌కు 45, ఢేకియాజులి కిలోమీటర్ల దూరం ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు పేర్కొంది. సొనిట్‌పూర్ టౌన్ సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఇది సంభవించినట్లు స్పష్టం చేసింది. 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల దాని ప్రకంపనలు రాష్ట్రం మొత్తం మీద నమోదైనట్లు సిస్మాలజీ సెంటర్ అంచనా వేసింది.
Just experienced a massive earthquake in Assam. Waiting for details
— Himanta Biswa Sarma (@himantabiswa) April 28, 2021

తాను స్వయంగా భూకంప తీవ్రతను అనుభవించినట్లు మంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇప్పటిదాకా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు అందలేదని పేర్కొన్నారు. దీనికోసం ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. కగా- భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న సొనిట్‌పూర్‌లో కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం ఉంది. కొన్ని నివాసాలు బీటలు వారినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ప్రధాన భూకంపం అనంతరం కూడా..దాని ప్రకంపనలు మరి కొంతసమయం పాటు కొనసాగినట్లు సిస్మాలజీ సెంటర్ తెలిపింది. రాష్ట్ర మొత్తం మీద దాని ప్రభావం ఉందని పేర్కొంది. ఈ నెల 5వ తేదీన సిక్కిం-నేపాల్ సరిహద్దుల్లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సిక్కిం భూకంప తీవ్రత మూడు రాష్ట్రాల్లో కనిపించింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాంలల్లో ప్రకంపనలు రికార్డయ్యాయి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications