Assam Exit Poll 2026: అసోంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ..!

2026 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో యాక్సిస్‌ మై ఇండియా సర్వే అంచనా ప్రకారం ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అధికార బీజేపీ కూటమి 88 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక కాంగ్రెస్ కూటమి 24 నుంచి 36 స్థానాల్లో గెలుపొందనుంది. మరోవైపు ఇతరులకు 0 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు యాక్సిస్‌ మై ఇండియా సర్వే అంచనా వేసింది.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి. కాంగ్రెస్ పార్టీకి2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఈడీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనాల ప్రకారం స్పష్టమవుతోంది. ఈ కూటమికి 88 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 36 స్థానాల్లో విజయం దక్కనుంది. ఇక ఇతరులకు 0-3 సీట్లు దక్కే ఛాన్స్ ఉన్నట్లు యాక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది.

ఇక 2021 అసోం ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజం అయ్యాయి. 2021లో యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 75-80 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ కూటమి 75 స్థానాలకు గెలుచకుని విజయం సాధించింది. 2021 లో బీజేపీ ఒంటరిగానే 60 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షాలు అయిన ఏజీపీ 9 స్థానాలు, యూపీపీఎల్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఈ మేరకు మరోసారి అసోంలో ఎగ్జిట్ పోల్స్ నిజం కానున్నట్లు తెలుస్తోంది.

assam Exit Poll 2026 Axis My India Predicts BJP HatTrick with 88-100 Seats for the NDA Alliance

2026 ఎన్నికల్లో అసోంలో రికార్డు స్థాయిలో 85.8 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. రాష్ట్రంలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9 న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+