Assam Exit Poll 2026: కాంగ్రెస్ గల్లంతు.. కాషాయ పార్టీకి తిరుగులేని మెజారిటీ..!

అసోంలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ తాజాగా వెల్లడయ్యాయి. రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ ఈ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా మాట్రిజ్ సర్వే ఈ మేరకు ఫలితాలను వెల్లడించింది. మాట్రిజ్ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి అసోంలో 85 నుంచి 95 సీట్లు దక్కనున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక ఇతరులు 6 నుంచి 12 స్థానాల్లో గెలుపొందనున్నట్లు మాట్రిజ్ సర్వే అంచనా వేసింది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీకి 64 స్థానాలు అవసరం.

ఈ లెక్కన బీజేపీ ఈసారి కూడా సొంతంగానే 64 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేస్తోంది. 2021 అసోం ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజం అయ్యాయి. 2021 లో మాట్రిజ్ సర్వే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది. మాట్రిజ్ సర్వే ప్రకారం 2021 లో ఎన్డీఏ కూటమి 73 నుంచి 84 స్థానాల్లో విజయం సాధించనుంది. అలాగే కాంగ్రెస్ మహజోత్ కూటమి 40 నుంచి 50 స్థానాల్లో గెలుపొందనుంది. ఇక ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు మాట్రిజ్ సర్వే అంచనా వేసింది.

Assam Exit Poll 2026 Matrize Survey Predicts Huge BJP Victory With 85-95 Seats for Ruling Alliance

ఆ అంచనాలు దాదాపు నిజం అయ్యాయి. మే 2, 2021 లో విడుదలైన తుది ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. మాట్రిజ్ సర్వే అంచనా వేసినట్టుగానే బీజేపీ కూటమి సులభంగా మెజారిటీ మార్కును దాటింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అసోం ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక మే 4 న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2026 ఎన్నికల్లో అసోంలో రికార్డు స్థాయిలో 85.8 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. రాష్ట్రంలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9 న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+