అస్సాం.. అస్సామీలదే..! సీఏఏ వ్యతిరేక హింసపై సిట్.. ఒక్కరినీ వదిలిపెట్టం: సీఎం సోనోవాల్
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల అస్సామీలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, అస్సాం.. ఎప్పటికీ అస్సామీల సొంత రాష్ట్రంగానే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. సీఏఏ, ఎన్సార్సీపై ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఒకవేళ ఏవైనా ఇబ్బందులొస్తే పరిష్కరించడానికి కేంద్రం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అలాగే, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చోటుచేసుకున్న హింసపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.

ఆధారాలతో పట్టుకుంటాం
సీఏఏ చట్టంపై మొదటిగా ఆందోళనలు మొదలైంది అస్సాంలోనే. చట్టం అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో చాలా చోట్ల హింస చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడం లాంటి ఘటనలెన్నో జరిగాయి. వాటికి బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని, ఆధారాలతో సహా దోషుల్ని సిట్ గుర్తిస్తుందని సీఎం సోనోవాల్ చెప్పారు.

ఇంటర్నెట్ సేవలు యథాతథం
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చోటుచేసుకోవడంతో కొత్త ప్రాంతాలకు అది వ్యాంపించొద్దన్న ఉద్దేశంతో అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 11న ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. 16వ తేదీనాటికి మరో 10 జిల్లాల్లో ఇంటర్నెట్ బ్యాన్ వర్తింపజేశారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పరిస్థితులు సర్దుమణిగిన నేపథ్యంలో నెట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అస్సాం అకార్డ్ పై మోదీ, షా మాటిచ్చారు
అస్సాంలో విదేశీయుల అక్రమ వలసల్ని ఖరారుచేసే కటాఫ్ తేదీని(మార్చి 24, 1971) గుర్తించే ‘అస్సాం అకార్డ్'లోని ఆరో క్లాజుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కచ్చితమైన హామీ ఇచ్చారని, అస్సాం.. అస్సామీలదేనని చాటిచెప్పుకోడానికి అవసరమైతే మరికొన్ని చట్టాలు తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం సోనోవాల్ చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications