వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనోహరీ.. ఇది చాలా కాస్లీ గురూ..

|
Google Oneindia TeluguNews

గౌహతి : ఛాయ్.. ఈ పేరు వినగానే చాలా మందికి ప్రాణం లేచివస్తుంది. తిండిలేకపోయినా పర్వాలేదు.. టీ ఉంటే చాలు అనే వారు చాలా మంది ఉంటారు. రకరకాల టీలు టేస్ట్ చేస్తూ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటుంటారు. అందుకోసం ఎంత మొత్తం చెల్లించేందుకైనా సిద్ధమవుతారు. దేశంలో టీ పొడి ఉత్పత్తికి పేరు గాంచిన అసోంలో అలాంటి వారి కోసం పండించిన అత్యంత అరుదైన టీ పొడిని వేలం వేయగా రికార్డు ధర పలికింది.

కిలో ధర రూ.50వేలు

కిలో ధర రూ.50వేలు

గౌహతి టీ ఆక్షన్ సెంటర్‌లో నిర్వహించిన వేలంలో అసోంకి చెందిన అరుదైన రకం టీ పొడి కిలో అక్షరాలా రూ.50,000 పలికింది. అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కిలో టీ పొడి ఇంత భారీ మొత్తం పలకడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఇంతకీ ఆ టీ పొడి పేరు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. మే - జూన్ నెల్లో మాత్రమే అసోంలో దొరికే ఆ చాయ్ పత్తి పేరు మనోహరి గోల్డ్. దిబ్రూగఢ్‌లోని టీ ఎస్టేట్‌లో దీన్ని పండించారు. ఆకులను కాకుండా మొగ్గలను మాత్రమే ఈ టీ పొడి తయారీకి ఉపయోగిస్తారు.

గతంలోనూ రికార్డు

గతంలోనూ రికార్డు

గతేడాది నిర్వహించిన వేలంలో కిలో మనోహరి గోల్డ్ ధర రూ. 39,001 పలికి రికార్డు సృష్టించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని దోన్యీ పోలో టీ ఎస్టేట్‌లో పండించిన గోల్డెన్ నీడిల్ వెరైటీ కిలో రూ.40వేలు పలికి ఆ రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా మనోహరి గోల్డ్ ఆ రికార్డును మళ్లీ ఖాతాలో వేసుకుంది. వేలంలో టీ పొడి రూ.50వేలు పలకడంపై గౌహతి టీ ఆక్షన్ బయ్యర్స్ అసోసియేషన్ సెక్రటరీ దినేష్ బిహానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రిటైల్ మార్కెట్‌లో 100గ్రా. రూ.8వేలు

రిటైల్ మార్కెట్‌లో 100గ్రా. రూ.8వేలు

సౌరభ్ టీ ట్రేడర్స్ ఓనర్ మంజీలాల్ మహేశ్వరి వేలంలో ఈ టీ పొడిని దక్కించుకున్నారు. ఆయన 2018లో 2 కేజీల మనోహరి గోల్డ్‌ను టీ పొడి కొన్నారు. ఓ కస్టమర్లకు అది తెగ నచ్చేయడంతో ఆయన కోరిక మేరకు మళ్లీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో తాను కొన్న మనోహరి గోల్డ్ టీ పొడిని 100 గ్రాములను రూ.8వేలకు అమ్మినట్లు చెప్పారు. తమ తోటలో పండించిన టీ పొడి భారీ రేటు పలకడంపై మనోహరి టీ ఎస్టేట్ ఓనర్ రాజన్ లోహియా సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా కేవలం ఐదు కిలోల తేయాకు మాత్రమే చేతికి వచ్చిందని చెప్పారు.

English summary
Highest price ever paid for tea in a public auction, A kilogram of Manohari Gold Tea from a garden in Assam sold for Rs 50,000 at the Guwahati Tea Auction Centre on Tuesday morning.Last year, a kilogram of the same tea was sold for Rs 39,001, a record which was soon broken by Golden Needle variety from the Donyi Polo Tea Estate in Arunachal Pradesh which sold for Rs 40,000 a kilo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X