ఐఏఎస్ చదువుతున్న అస్సాం యువకుడిని ఎముకలు విరిగేలా కొట్టిన ఢిల్లీవాసులు
న్యూఢిల్లీ: తాగిన మైకంలో తన గది అనుకొని పక్కింటి తలుపులు తెరవాలని ప్రయత్నించిన అస్సాం విద్యార్ధిని చుట్టుపక్కల వాళ్లు చితగొట్టారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గౌహతీకి చెందిన అర్బాజుద్దీన్ (21) తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. తన ఇల్లు అనుకొని పక్కింటి తలుపు తాళం తీయాలని ప్రయత్నించాడు. ఎంతసేపటికీ తాళం తెరుచుకోకపోడవంతో పగలగొట్టాలని చూశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అహ్మద్‌ను పట్టుకొని కొట్టారు.

ఈ ఘటనలో అతని కాలు, భుజంతో పాటు శరీరంలో కొన్ని భాగాల్లో ఎముకలు విరిగాయి. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడి గుర్తింపు కార్డు పరిశీలించిన పోలీసులు అతను కూడా ఇదే కాలనీకి చెందినవాడిగా గుర్తించారు.
తలుపులు ఒకేలా ఉండటం, రూంలు ఒకే ఫ్లోర్‌లో ఉండటంతో పొరపాటున పక్కింటికి వెళ్లినట్లు పోలీసులు విచారణలో గుర్తించామన్నారు. ఐఏఎస్ అయ్యేందుకు అస్సాం నుంచి వచ్చిన అర్బాజుద్దీన్ గత రెండేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్నాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications