LIVE
 Assembly election results 2022: బీజేపీ జోరు.. యోగికే మరలా పట్టం ! పంజాబ్‌లో కాంగ్రెస్‌ను చిత్తు చేసిన ఆప్ !!

Assembly election results 2022: బీజేపీ జోరు.. యోగికే మరలా పట్టం ! పంజాబ్‌లో కాంగ్రెస్‌ను చిత్తు చేసిన ఆప్ !!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరిగాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం ఏడు విడతలుగా పోలింగ్ జరుగగా... పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు ఒకే విడత మణిపూర్‌కు రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇక మార్చి 7వ తేదీన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుండగా... ఉత్తరాఖండ్, గోవాలో హంగ్‌కు అవకాశాలున్నాయంటూ ఫలితాలు తేల్చాయి. పంజాబ్‌లో ఆప్ సత్తా చాటుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టత ఇచ్చాయి. ఇక మణిపూర్‌లో కమలం పార్టీ హవా కొనసాగుతుందని పేర్కొంది.

2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీన వెలువడుతాయి. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా లేక అంచనాలు తప్పుతాయా అనేది మరికొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది. ఇక కౌంటింగ్‌, టాప్ ఫైట్స్‌కు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

4:58 PM
Mar 11, 2022

గుజరాత్ పంచాయత్ మహా సమ్మేళన్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

3:49 PM
Mar 11, 2022

ఢిల్లీ కార్పొరేషన్ సంస్కరణలకు కేజ్రీవాల్ వ్యతిరేకం: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కౌంటర్ అటాక్

3:24 PM
Mar 11, 2022

2024లో మోడీని ఛాలెంజ్ చేసేదీ ఎవరు..? రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలతో పోల్చలేం అన్న పీకే

3:22 PM
Mar 11, 2022

అరవింద్ కేజ్రీవాల్ ఆశీర్వాదం తీసుకున్న పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ సింగ్ మాన్

3:12 PM
Mar 11, 2022

గుజరాత్ పంచాయత్ మహా సమ్మేళన్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని మోడీ

3:09 PM
Mar 11, 2022

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి: ప్రధాని మోడీకి అరవింద్ కేజ్రీవాల్ రిక్వెస్ట్

2:43 PM
Mar 11, 2022
ఢిల్లీ

ఢిల్లీకి చేరుకున్న పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్. ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన కలుసుకున్నారు.

2:10 PM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

హోలీ పండగ కంటే ముందే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 15వ తేదీన ఈ కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

1:59 PM
Mar 11, 2022
ఉత్తరాఖండ్

తమ పదవులకు రాజీనామా చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ, ఆయన మంత్రివర్గ సహచరులు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ గుర్మీత్ సింగ్‌కు అందజేశారు.

1:19 PM
Mar 11, 2022
పంజాబ్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేయవద్దని, వాటిని అమలు చేయాలని ఆయన కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

12:52 PM
Mar 11, 2022
పంజాబ్

గవర్నర్‌ను కలవడానికి చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవ్వడంతో ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఛన్నీ ఓడిపోయారు.

12:43 PM
Mar 11, 2022
జార్ఖండ్

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించినందుకు గుర్తుగా కాషాయ దుస్తులను ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు.

11:26 AM
Mar 11, 2022
మహారాష్ట్ర

ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక పాత్ర పోషించారంటూ విమర్శలు గుప్పించిన శివసేన నేత సంజయ్ రౌత్. వారిద్దరికీ పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాలని సెటైర్లు వేశారు.

11:21 AM
Mar 11, 2022
గుజరాత్

నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన మరుసటి రోజే- సొంత రాష్ట్రానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన మోడీ. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఆయనకు స్వాగతం పలికారు.

11:02 AM
Mar 11, 2022
మహారాష్ట్ర

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోయాడు?, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ఓటమి కారణాలు ఏంటీ?, పంజాబ్‌లో ఘోర పరాజయం ఎందుకు పొందారు?: ఇవన్నీ చూస్తే బీజేపీ పట్టు నిలుపుకొన్నట్టా..: శివసేన నేత సంజయ్ రౌత్

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోయాడు?, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ఓటమి కారణాలు ఏంటీ?, పంజాబ్‌లో ఘోర పరాజయం ఎందుకు పొందారు?: ఇవన్నీ చూస్తే బీజేపీ పట్టు నిలుపుకొన్నట్టా..: శివసేన నేత సంజయ్ రౌత్

10:55 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

భారతయ జనతా పార్టీని రాజకీయంగా ఎదుర్కొనడంలో రాజీ పడొద్దు. ఎప్పట్లాగే- తమ పోరాటాన్ని సాగించాలి. పార్టీ అగ్రనాయకత్వం అండగా ఉంటుంది. ఈ ఎన్నికల ఫలితాలు నిరుత్సాహ పడొద్దు: పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపు

10:43 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

ముస్లిమేతర ఓటుబ్యాంకు- దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లు సమాజ్‌వాది పార్టీకి అధికారం దక్కకుండా సమర్థవంతంగా అడ్డుకోగలిగాయి. ఈ వ్యవహారంలో తమ ఓటుబ్యాంకు కూడా బీజేపీకే మళ్లింది: బీఎస్పీ అధినేత్రి మాయావతి

10:40 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

బీజేపీని ఓడించే విషయంలో ముస్లింల ఓటుబ్యాంకు తమ కంటే సమాజ్‌వాది పార్టీని ఎక్కువగా విశ్వసించారు. ఆ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా సమాజ్‌వాది పార్టీకే దక్కాయి. ఎన్నికల్లో తాము తీవ్రంగా నష్టపోవడానికి ఇదీ ఓ కారణమైంది: బీఎస్పీ అధినేత్రి మాయావతి

10:31 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

తమ పార్టీని బీ-టీమ్‌గా ప్రజలను నమ్మించడంలో బీజేపీ విజయం సాధించింది. ఓటర్లను తప్పుదారి పట్టించింది. బీజేపీ వర్సెస్ బీఎస్పీ మధ్య పోరాటం రాజకీయపరమైనదే కాదు.. సిద్ధాంతపరం కూడా: బీఎస్పీ అధినేత్రి మాయావతి

10:27 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపట్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ ఫలితాల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. వాటిని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా అధికారంలోకి వస్తాం: బీఎస్పీ అధినేత్రి మాయావతి

10:24 AM
Mar 11, 2022
ఉత్తరాఖండ్

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలకు సంబంధించిన ఓట్ల శాతం. బీజేపీ అత్యధిక ఓట్ల షేరింగ్‌ను నమోదు చేసింది.

10:22 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్న బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

10:16 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలకు సంబంధించిన ఓట్ల శాతం. బీజేపీ 41.29, సమాజ్‌వాది పార్టీ 32.06 శాతం ఓట్లను సాధించాయి.

10:04 AM
Mar 11, 2022

ఉత్తర్ ప్రదేశ్‌లో ఒపీనియన్ పోల్స్ వర్సెస్ ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ వాస్తవ ఫలితాలు

10:03 AM
Mar 11, 2022
యూపీ పొలిటికల్ పార్టీల సక్సెస్ గ్రాఫ్

ఉత్తర్ ప్రదేశ్‌లో టాప్ పొలిటికల్ పార్టీల యొక్క సక్సెస్ గ్రాఫ్

9:41 AM
Mar 11, 2022

పంజాబ్‌లో బీజేపీకి రైతులు గట్టిగా బుద్ధి చెప్పారు: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

8:24 AM
Mar 11, 2022
పంజాబ్

ఇవ్వాళ ఢిల్లీ వెళ్లనున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన కలుసుకోనున్నారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయాన్ని సాధించడంతో భగవంత్ మాన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనప్రాయం.

8:05 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు సురేష్ రాణా, ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, రాజేంద్రప్రతాప్ సింగ్, చంద్రిక ప్రసాద్ ఉపాధ్యాయ, ఆనంద్ స్వరూప్ శుక్లా, ఉపేంద్ర తివారీ, రణ్‌వీర్ సింగ్ ధున్ని, లఖన్ సింగ్ రాజ్‌పుత్, సతీష్ చంద్ర ద్వివేది ఓడిపోయారు.

7:55 AM
Mar 11, 2022
ఉత్తర్ ప్రదేశ్

యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనంలోనూ 10 మంది ఆయన కేబినెట్ సహచరులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పరాజయం పాలయ్యారు. సిరాథు స్థానంలో ఆయనపై సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి పల్లవి పటేల్ 7,337 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

7:32 AM
Mar 11, 2022

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాల్సిందిగా ఇవ్వాళ గవర్నర్లను కలుసుకోనున్న మణిపూర్, గోవా ముఖ్యమంత్రులు. ఈ రెండు చోట్ల బీజేపీ మళ్లీ అధికారంలోకి రానుంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

READ MORE