కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైయ్యింది, ఇది ఆరంభం మాత్రమే, ముందుముందు ముసళ్లపండగ !

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి అని, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మరింత పెరిగిందని, కర్ణాటక కాంగ్రెస్‌కు ఇదొక చెంపదెబ్బ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఆదివారం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో బెంగళూరులో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల విషయమై మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలులు సెమీఫైనల్ అని ఇటీవల కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారని బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

Assembly Election Results 2023 are semifinals for Lok Sabha elections, says Basavaraj Bommay

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినట్లే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని, ఈ ఫలితం లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ అని, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీర్పును అంగీకరించాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

మధ్యప్రదేశ్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో మాకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ముందుకంటే ఎక్కువగానే పెరిగిందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఈ ఫలితానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌవాన్ సహా బీజేపీ నేతలంతా కలిసికట్టుగా పని చేశారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

బీజేపీ విజయానికి పని చేసిన నాయకులు అందరికి ధన్యవాదాలు అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కుల రాజకీయాలకు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని, ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చెయ్యాలని ప్రయత్నించారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

కర్జాటకలో పైపైకి ఉచిత హామీలను ప్రారంభించింది కర్ణాటక ప్రజలను మోసం చేసినట్లు దేశం మొత్తం మోసం చెయ్యాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయితే కాంగ్రెస్ ఎత్తులు ఫలించలేదని, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజల విశ్వాసం పొందేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని, ప్రజలు ఉచిత హామీలను తిరస్కరించారని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ ఎంపీలు వస్తారని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతరాని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ జోస్యం చెప్పారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు చావు దెబ్బ తిన్నాయని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+