వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ -కూతుళ్లతో కలిసి ఓటేసిన కమల్ -అస్సాంలో మళ్లీ భూకంపం

|
Google Oneindia TeluguNews

దేశంలో మినీ సంగ్రామంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఆరంభమైంది. అలాగే, పశ్చిమ బెంగాల్, అస్సాంలోనూ మూడో దశ పోలింగ్ మొదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 7లోపే జనం భారీగా పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం కనిపించింది.

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

దక్షిణాదిలోని మూడు చోట్ల(తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో) ఒకే దఫాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు 3,998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మక్కల్ నీది మాయుమ్ (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ తన కూతుళ్లు శృతి హాసన్, అక్షరలతో కలిసి చెన్నైలోని తెయినంపేటలో ఉదయమే ఓటువేశారు.

Assembly elections 2021: Voting Begins in TN, Kerala, Puducherry, Phase 3 of Bengal, Assam Polls

మూడో దశ పోలింగ్ వేళ అస్సాంలో స్వల్ప భూకంపం సంభవించింది. తిన్ సుకియా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూమి కంపించింది. తిన్ సుకియా ప్రాంతంలో సంభవించిన భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అస్సాంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. సిక్కిం-నేపాల్ సరిహద్దుల్లో సోమవారం రాత్రి 8.49 గంటలకు భూకంపం సంభవించింది. సిక్కింలో సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు.

 రాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేత రాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేత

Assembly elections 2021: Voting Begins in TN, Kerala, Puducherry, Phase 3 of Bengal, Assam Polls

పశ్చిమ బెంగాల్ లో మూడో దశలోనూ పోలింగ్ శాతం భారీగా నమోదవుతనే అంచనాలకు తగ్గట్లే మంగళవారం ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల సందడి కనిపించింది. మహిళలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. సున్నిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాలు చేశారు. ఒకటి రెండు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈసీ వెంటనే పరిష్కరించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

English summary
Polling for the third phase of assembly elections in West Bengal and Assam has begun at 7 am on Tuesday. Besides West Bengal and Assam, the Assembly Elections 2021 are also taking place in Tamil Nadu, Kerala and Puducherry. The polling in these two southern states and the union territory has also begun at 7 am today. The voting will conclude at 6 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X