election commission West Bengal Assembly Elections 2021 Assam Assembly Elections 2021 kerala assembly elections 2021 ఎన్నికల కమిషన్ ఈసీ బైక్
5రాష్ట్రాల్లో బైక్ ర్యాలీలకు బ్రేకులు -పోలింగ్‌కు 72 గంటల ముందు వద్దన్న ఈసీ -అనూహ్య కామెంట్లు
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. సదరు రాష్ట్రాల్లో విడతలవారీగా ఎన్నికలు జరుగనుండగా, పోలింగ్‌కు 72 గంటలకు ముందు నుంచి బైక్ ర్యాలీలను అనుమతించేది లేదని ఈసీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన ప్రకటన -కొవిషీల్డ్ రెండో డోసు గ్యాప్ 8వారాలకు పెంపు -ఎందుకంటే
సాధారణంగా పోలింగ్ తేదీకి రెండ్రోజుల ముందు వరకూ అభ్యర్థులను ప్రచారానికి అనుమతిస్తారని తెలిసిందే. అయితే, పోలింగ్ ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో సంఘ వ్యతిరేక శక్తులు ఓటర్లను భయపెట్టేందుకే ప్రచారం పేరుతో బైక్ ర్యాలీలు తీస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల రోజుకు 72 గంటలకు ముందు నుంచే ఆయా నియోజకవర్గాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ బైక్ ర్యాలీలను అనుమతించరాదనే నిర్ణయానికి వచ్చామని ఈసీ తెలిపింది.

పోలింగ్ గడువుకు మూడు రోజుల ముందే (72 గంటల ముందే) బైక్ ర్యాలీలు నిలిపేయాలన్న ఈసీ నిర్ణయాన్ని ఆయా పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాల్సి ఉంటుందని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై పార్టీల స్పందన వెలువడాల్సిఉంది. కాగా,
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ
కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలిపి మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 27తో పోలింగ్ ప్రక్రియ మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తుంది. మొత్తం 2.7 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 18.68 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.