మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాల మధ్య ఓ కొత్త వాదన తెరమీదికి వచ్చింది. ఈ నెల 21న పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగొచ్చనే చర్చ ఆరంభమైంది. ఓ ప్రముఖ జ్యోతిష్యురాలు దీనికి కేంద్రబిందువు అయ్యారు. పాకిస్తాన్ పై భారత్ దాడికి దిగే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. గ్రహాల స్థితిగతుల ఆధారంగా లెక్కగట్టానని తెలిపారు. అంగారక యోగం, నక్షత్రాల గమనాలు, ఇతర జ్యోతిష్య సంబంధిత గణనాలను విశ్లేషించి చూడగా..పాకిస్తాన్ పై భారత్ దాడి జరిగి తీరుతుందని చెప్పారు.

తనను తాను వేదిక్ ఆస్ట్రాలజర్ గా, వాస్తు నిపుణురాలిని చెప్పుకొన్నారామె. ఈ నెల 21న రిక్త తిథి ఉంటుందని, అలాగే రంజాన్ మాసం ముగిసి, మార్చి 19న నవరాత్రులు ప్రారంభమవుతాయని వివరించారు. మార్చి 21న ఏర్పడే కుండలిలో 4వ ఇంట్లో బుధ, రాహువు, మంగళ గ్రహాలు కూర్చుని అంగారక యోగం సృష్టిస్తాయని, 5వ ఇంట్లో సూర్యుడు, శని, నెప్ట్యూన్, శుక్రుడు కలిసి ఉంటారని వివరించారు. ఇదంతా జ్యేష్ఠా నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో జరుగుతుందని ఆ జ్యోతిష్యురాలు తెలిపారు.
క్రూర నక్షత్రం, క్రూర గ్రహాల లగ్నం, అంగారక, ఖపర్ యోగాలు, రిక్త తిథి, గ్రహణం తర్వాత 30-35 రోజుల దుర్బల సమయం మధ్య 21వ తేదీ.. దుర్గా శక్తి దేశానికి తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి మంగళ మహాదశ, దేశ మంగళ మహాదశలో రాహువు అంతర్దశంగా ఉందని, ఇది అంగారక యోగాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు.
గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పుడు జరిగే యుద్ధం అసాధారణ స్థితిలో ఉండొచ్చని, ఏకంగా రెండు దేశాల సరిహద్దులే మారిపోవచ్చని పేర్కొన్నారు. పాకిస్తాన్ రూపురేఖలు సమూలంగా మారుతాయని చెప్పారు. భారత్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన ఆరంభం అయ్యే యుద్ధం తర్వాత ఈ విలీన ప్రక్రియ మొదలవుతుందని అభిప్రాయపడ్డారు.
-
శని కుజుల ద్వి ద్వాదశ యోగం మొదలైంది.. ఈ రాశులవారికి సంపదలు డబుల్! -
Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే! -
120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం -
ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది -
ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది? -
వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా? -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?












Click it and Unblock the Notifications