డీకే మహర్జాతకుడు- మోదీకి అరిష్ఠం: ముందే హెచ్చరించిన ఆ జ్యోతిష్కుడు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 65 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్‌ను సమన్వయం చేసుకోగలిగారు.

ఇదిలావుండగా- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ ప్రతాప్ గతంలోనే అంచనా వేశారు. మే నెలలో బీజేపీకి అన్నీ చేదు అనుభవాలు ఎదురవుతాయని, ఎదురుదెబ్బలను చవి చూస్తుందని ఆయన హెచ్చరించారు. మే నెలలో షెడ్యూల్ అయిన ఎన్నికలు బీజేపీకి అరిష్ఠాన్ని తెచ్చిపెడతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఓ ట్వీట్ చేశారు.
— Rudrá Karan Pártaap🇮🇳 (@Karanpartap01) May 13, 2023
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మహర్జాతకుడని, ఆయన గురుబలం ఉచ్ఛస్థితిలో ఉందనీ రుద్ర కరణ్ ప్రతాప్ చెప్పారు. ఆయనకు రాజయోగం రాసివుందని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లేదా 122 నుంచి 133 స్థానాలతో ఘన విజయం సాధిస్తుందనీ చెప్పుకొచ్చారు. ఎలాంటి పొత్తులు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఆ ట్వీట్‌లో వివరించారాయన.
ఈ సందర్భంగా- కర్ణాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ రోహన్ మిశ్రా అనే ఓ ట్విట్టరెటీ అడిగిన ప్రశ్నకు రుద్ర కరణ్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 133 సీట్లు లభిస్తాయంటూ ఏప్రిల్ 18వ తేదీన మరో ట్వీట్ చేశారాయన. ఆ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 136 సీట్లను సాధించింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications