సర్పంచ్ ఎన్నికల్లో ఘోర ఓటమి.. 21 లక్షల ఫాలోవర్లు ఉంటే పడింది 33 ఓట్లే!

సోషల్ మీడియాలో వేలల్లో, లక్షల్లో ఫాలోవర్లు ఉంటే తాము ఏది చేసినా జనం ఆదరిస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! డిజిటల్ ప్రపంచంలో వచ్చే లైకులు, కామెంట్లు నిజ జీవితంలో ఓట్లుగా మారవని నిరూపించే ఒక విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏకంగా 21 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, ఇన్ఫ్లుయెన్సర్ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. జనం జాతకాలు చెప్పే ఆయన, తన స్వంత ఎన్నికల ఫలితాన్ని మాత్రం అంచనా వేయలేకపోయాడని ఇప్పుడు నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు.

1600 ఓట్లలో పడింది కేవలం 33 ఓట్లే!

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఓసియాన్ పరిధిలోని 'ఇందోన్ కీ ధానీ-2' గ్రామానికి చెందిన ఓంప్రకాష్ బిష్ణోయ్ ఫేస్ రీడర్‌గా, జ్యోతిష్యుడిగా, యూట్యూబర్‌గా నెటిజన్లకు బాగా సుపరిచితుడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షలు, యూట్యూబ్‌లో 5.5 లక్షలు, ఫేస్‌బుక్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మొత్తం కలిపితే 21 లక్షల మంది ఆయన్ను అనుసరిస్తున్నారు. గ్రామంలోని స్థానిక గోశాలకు అధ్యక్షుడు కూడా. ఈ ప్రజాదరణతో తన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. ఊరిలో ఉన్న దాదాపు 1600 మంది ఓటర్లలో ఆయనకు పడిన ఓట్లు కేవలం 33 మాత్రమే!

Astrologer with 21 Lakh Followers Contests Panchayat Election in Rajasthan Gets Only 33 Votes
13 లక్షల మంది ఫాలోవర్లు.. ఫైనాన్స్ ప్రపంచంలో మంచి గుర్తింపు.. కానీ చివరకు..
13 లక్షల మంది ఫాలోవర్లు.. ఫైనాన్స్ ప్రపంచంలో మంచి గుర్తింపు.. కానీ చివరకు..

సోషల్ మీడియా పాపులారిటీ వేరు.. క్షేత్రస్థాయి రాజకీయాలు వేరు!

ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఈ ఫలితం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటే చాలు ఎన్నికల్లో గెలిచేయవచ్చని భావించే వారికి ఇది కనువిప్పు లాంటి సంఘటన అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ వ్యక్తిగత సంబంధాలు, ఊరి ప్రజలతో ఉండే అనుబంధం, క్షేత్రస్థాయిలో చేసిన పనులపై ఆధారపడి ఉంటాయని, కేవలం స్క్రీన్ మీదుండే ఫాలోవర్ల సంఖ్య చూసి ఓట్లు పడవని ఈ ఎన్నిక రుజువు చేసింది.

దీపావళికి స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. 70 కోట్ల యుద్ధ ట్యాంకర్ ఆర్డర్ చేశారు
దీపావళికి స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. 70 కోట్ల యుద్ధ ట్యాంకర్ ఆర్డర్ చేశారు

నా గ్రామం వరల్డ్ ఫేమస్ అయింది: ఓటమిపై స్పందించిన జ్యోతిష్యుడు

ఈ ఘోర పరాజయంపై ఓంప్రకాష్ బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నా ఓటమితో ఇందోన్ కీ ధానీ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో నా ఊరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత గుర్తింపు తెచ్చుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో మందు, డబ్బులు పంచి ఓట్లు అడగకుండా ధర్మంగా పోటీ చేశానని, అందుకే తనకు ఈ 33 మంది మద్దతుగా నిలిచారని సంతృప్తి వ్యక్తం చేశారు. కష్టకాలంలోనే మన వెంట ఎవరు నిలబడతారో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+