దీపావళికి స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. 70 కోట్ల యుద్ధ ట్యాంకర్ ఆర్డర్ చేశారు

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం ఒక లెక్క.. కానీ ఒక్కోసారి ఆ పాపులారిటీనే పాలిట శాపంగా మారడం అంటే ఇదే కాబోలు! మధురైకి చెందిన వీరమణి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తనదైన హాస్యంతో, స్థానిక మాండలిక వీడియోలతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే రాబోయే దీపావళి పండగ సందర్భంగా తన ఫాలోవర్లు ఎవరైనా తనకు ప్రేమగా ఒక డబ్బా స్వీట్లు పంపిస్తారేమోనని ఆశపడి తన ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ నెటిజన్లు మాత్రం అతనికి స్వీట్లు పంపడం పక్కన పెట్టి.. ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.లక్షలు విలువ చేసే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆయన పేరు మీద క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు చేయడం మొదలుపెట్టారు.

Madurai Influencer Requested Diwali Sweets From Followers But Received Bizarre Fake COD Orders Today

డెలివరీ బాయ్స్‌ ఇంటి ముందు క్యూ!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల నుంచి డెలివరీ బాయ్స్ వరుసగా వీరమణి ఇంటి ముందుకు క్యూ కట్టారు. ఏకంగా రూ.1.69 లక్షల విలువైన పెద్ద ఎల్ఈడీ టీవీతో పాటు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్‌లు మోసుకుంటూ డెలివరీ సిబ్బంది ఆయన ఇంటికి వచ్చారు. ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో ఆర్డర్ చేయడంతో.. వాటిని తీసుకోవాలంటే నగదు చెల్లించాలని డెలివరీ బాయ్స్ పట్టుబట్టారు. అసలు తాను ఇవేవీ ఆర్డర్ చేయలేదని, వాటిని కొనే ఆర్థిక స్థోమత తనకు లేదని, కనీసం డెలివరీ పూర్తి చేయడానికి కావాల్సిన ఓటీపీలు కూడా తాను ఇవ్వలేదని వీరమణి వాపోయాడు. కేవలం అర్ధగంట వ్యవధిలోనే పదిహేనుకు పైగా పార్సిళ్లు రావడంతో ఆయన కంగుతిన్నాడు.

దసరా, దీపావళికి ఊహించని షాక్! ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..
దసరా, దీపావళికి ఊహించని షాక్! ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..

"కాళ్ళ మీద పడతాను.. దయచేసి ఆర్డర్లు ఆపండి!"

తొలుత కేరళ ట్రిప్ కోసం ఫాలోవర్లను సాయం కోరినప్పుడు ఎంతో స్పందన వచ్చిందని, దాంతో నమ్మకంతోనే ఈసారి స్వీట్లు అడిగానని వీరమణి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ కొందరు ఆకతాయిలు తన ఫోన్ నంబర్‌ను దుర్వినియోగం చేస్తూ ఇలా ఫేక్ ఆర్డర్లు పెడుతున్నారని ఆరోపించాడు. "దూర ప్రాంతాల నుంచి డెలివరీ బాయ్స్ వస్తున్నారు.. నా దగ్గర డబ్బులు లేవు, నేను కేవలం భిక్షమెత్తుకునేవాడిని, దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి.. మీ కాళ్ళు పడతాను, ఈ ఆర్డర్లు ఆపండి" అంటూ అతను సోషల్ మీడియాలో కన్నీరుమున్నీరవుతూ వీడియోలు రిలీజ్ చేశాడు. ఫోన్ ఆన్ చేసినా, ఆఫ్ చేసినా తనకొచ్చే ఈ వేధింపులు భరించలేకుండా ఉన్నాయని వాపోయాడు.

 దీపావళి అందం మొత్తం నీ దగ్గర ఉంది అమ్మడు
దీపావళి అందం మొత్తం నీ దగ్గర ఉంది అమ్మడు

ఫుడ్ డెలివరీలు, కిడ్నీ దానాలు, ఏకంగా జేసీబీలు.. సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు

ఈ ఫేక్ ఆర్డర్ల గోల కేవలం ఎలక్ట్రినిక్స్‌తో ఆగలేదు. స్విగ్గీ, జొమాటోల నుంచి రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఆయన ఇంటికి రావడం మొదలైంది. అంతటితో ఆగకుండా ఆయన నంబర్‌ను కిడ్నీ దానాల ప్రకటనలతో ముడిపెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. అంతేకాకుండా వీరమణికి ఏకంగా రూ.70 కోట్ల విలువైన మిలటరీ ట్యాంకులు, జేసీబీ ఎస్కవేటర్లు ఆర్డర్ చేశామంటూ కొందరు సోషల్ మీడియాలో ఫేక్ స్క్రీన్ షాట్లు వైరల్ చేశారు. ఈ విపరీత పోకడలతో విసిగిపోయిన వీరమణి, తనను ఎవరో 'స్వీట్ బాక్స్ దొంగ' అంటూ పోస్టర్లు వేసి హేళన చేయడంతో.. వాటిపై కూడా తనదైన శైలిలో సరదాగా, వ్యంగ్యంగా స్పందిస్తూ మరో వీడియోను విడుదల చేశాడు.

ఎంత వేడుకున్నా ఆర్డర్లు వస్తూనే ఉండటంతో ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి అడ్రస్ మార్చేశారు. డెలివరీ బాయ్స్ కూడా ఇలా ఆర్డర్లు వస్తుండంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+