రిపబ్లిక్ డే: ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర, ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢీల్లీలో భారీ విధ్యంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఇంటిలిజెన్స్ బ్యూరో, రా అధికారులు భగ్నం చేశారు. ఇందులో భాగంగా నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం అరెస్టు చేశారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

వీరిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అరెస్ట్ చేసిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసర్చ్ అండ్ అనలైజింగ్ వింగ్ (రా) అధికారులు వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా, దేశంలోని పలు నగరాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం.
అంతేకాకుండా, ఢిల్లీలో మరో 10 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని తెలియడంలో... వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
హౌరా రైల్వే స్టేషన్‌లో మరో ఇద్దరు తీవ్రవాదుల అరెస్ట్
పశ్చిమ బెంగాల్ పోలీసులు మరో ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. హౌరా పోలీస్ స్టేషన్‌పై నిఘా పెంచిన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇద్దరు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని ఉల్ఫా తీవ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, నోయిడాలో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులకు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన బుర్ద్వాన్ ఘటనతో సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications