Amarnath yatra: 15 వేల మంది సేఫ్, మోదీ, అమిత్ షా ఎంట్రీ, తేరుకునే లోపు ముంచేసిన వర్షం, వరద, రాళ్లు!

శ్రీనగర్/ కాశ్మీర్: పవిత్ర అమరనాథ యాత్ర సందర్బంగా అనేక మంది గల్లంతు అయ్యారు. ఇప్పటికే అమరనాథ గుహ దగ్గర మేఘాలలో పేలుడు సంభవించడంతో అనేక మంది ఆచూకి తెలీకుండా పోయింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది 15 వేల మందిని రక్షించారు, వరదల్లో 40 మంది గల్లంతు అయ్యారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎన్ డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కుల్వార్ మీడియాకు చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అధికారులతో చర్చించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

15 వేల మంది సురక్షిత ప్రాంతాలకు

15 వేల మంది సురక్షిత ప్రాంతాలకు

అమరనాథ్ క్షేత్రానికి సమీపంలో చోటుచేసుకున్న ఆకస్మిక వరద భీభత్సంలో 16 మంది చనిపోయారని అధికారులు స్పష్టం చేశారు. అమర్ నాథ్ గుహ దగ్గర అకస్మికంగా సంభవించిన వరద కారనంగా వేలాది మంది చిక్కుకుపోయారని, వారిలో 15 వేల మంది భక్తులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఐటీబీసీ అధికార ప్రతినిధి చెప్పారు.

మంచు శివలింగం

మంచు శివలింగం

జూన్ 30వ తేదీన అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సందర్బంగా దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయాల్లోని మంచు లింగాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు విడతల వారికి బయలుదేరారు. అమర్ నాథ్ గుహకు సమీపంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది.

తేరుకునే లోపు ముంచేసింది

తేరుకునే లోపు ముంచేసింది

కుండపోత వర్షంతో యాత్రికుల తీవ్ర భయాందోళనకు గురైనారు. ఇదే సమయంలో యాత్రికులు తేరుకునే లోపు కొండ మీద నుంచి భారీ వరద నీరు, పెద్ద ఎత్తున బుర, రాళ్లు కొట్టుకుని రరావడంతో యాత్రికులు హడలిపోయారు. యాత్రికులు భయంతో పరుగు తియ్యడంతో తొక్కిసలాట జరిగి అనేక మందికి గాయాలైనాయని అధికారులు అంటున్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా

ప్రధాని మోదీ, అమిత్ షా

విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అధికారులతో చర్చించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ బలగాలతో పాటు భారత సైన్యం, ఎన్ డీఆర్ఎఫ్, సీఆర్ పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అమర్ నాథ్ యాత్రకు బయలుదేరిన యాత్రికును రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+