కుప్పకూలిన పుట్‌బాల్ గ్యాలరీ: 200 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం (వీడియో)

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మలప్పురం జిల్లా పూంగోడ్‌లో శనివారం రాత్రి ఆల్ ఇండియా సెవన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 8000 మంది వచ్చారు. దీంతో స్టేడియం మొత్తం కిక్కిరిసి పోయింది.

 At least 200 injured, 5 serious after gallery collapses during football match in Malappuram, Kerala

గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షుకులు కూర్చోవడంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో అందులో కూర్చున్నవాళ్లంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీ చుట్టుపక్కల మూడు వేల మంది వరకు ఉన్నారు.

సెవన్స్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. సరిగ్గా ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోయింది. దీంతో అంతా ఉలిక్కి పడ్డారు. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+