Atiq Ahmed case: క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసిన సిట్- వీడియో చూడండి..!

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్‌టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్య కేసులో త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేగం పెంచింది. ఘటన జరిగిన కాల్విన్ హాస్పిటల్ ప్రాంతంను సందర్శించారు.ఈ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి త్రిపాఠీ నేతృత్వం వహిస్తుండగా ఇందులో సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ సుబేష్ కుమార్ సింగ్, రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీలు ఉన్నారు.

ఇక అతీక్ అహ్మద్ హత్య జరిగిన రోజున ఎంతమంది పోలీసులు ఉన్నారనేదానిపై ఆరా తీసింది త్రిసభ్య కమిషన్.ఆ రోజు ఏం జరిగింది అనేదానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.సీన్ రీక్రియేట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కూడా కాల్విన్ హాస్పిటల్‌ను సందర్శించింది. క్రైమ్ సీన్ రీక్రియేషన్‌ చేపట్టాలని ముందుగా సిట్ భావించింది. అయితే జ్యుడీషియల్ కమిషన్ ఘటనా స్థలానికి వస్తుందని తెలియడంతో వాయిదా వేశారు.

 athifkhan

ఇదిలా ఉంటే అతీక్ సోదరులను మట్టుబెట్టిన లవ్లీష్, సన్నీ, మౌర్యా అనే ముగ్గురు నిందితులు తొలినుంచి ఒకే మాట చెబుతూ ఉన్నారు. అండర్ వరల్డ్‌లో గుర్తింపు పొందేందుకే అతీక్ అహ్మద్, ఆష్రాఫ్‌లను హత్యచేసినట్లు వారు చెబుతున్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్న ఈ ముగ్గురు నిందితులు అతీక్ లాంటి గ్యాంగ్స్‌టర్‌ను హత్య చేయడం వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలుసుకోవడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. పైపెచ్చు ఈ ముగ్గురు యువకుల కుటుంబాలకు గతంలో ఎలాంటి నేరచరిత లేదు.

ఈ ముగ్గురు నిందితుల వద్ద ఉన్న తుపాకులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నపై కూడా నిందితులు నోరు మెదపడం లేదు. వీరి వద్ద ఉన్న జిగానా పిస్టల్ ధర రూ.7 లక్షలని తెలుస్తోంది. మరి అంత ధర పెట్టి వీరు పిస్తోలును కొనుగోలు చేయగలిగే సామర్థ్యం ఉందా అనేది కూడా సమాధానం లేని మరో ప్రశ్నగా మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+