షాక్: ఎస్.బి.ఐ ఏటీఎం నుంచి నకిలీ రూ.2వేల నోటు..
బీహార్‌లోని సీతామహ్రి జిల్లా లంగ్మా అనే ప్రాంతంలో ఓ ఎస్.బి.ఐ ఏటీఎం నుంచి స్థానిక రైతుకు నకిలీ నోటు వచ్చింది.
: బీహార్‌లోని ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం నుంచి రూ.2వేల నకిలీ నోటు బయటపడింది. ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసుకుందామని వచ్చిన ఓ వ్యవసాయదారుడికి ఆ నోటు రాగా.. వేరే వ్యక్తికి ఆ నోటును చూపించడంతో అది నకీలిది అని చెప్పాడు.
దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో సదరు వ్యవసాయదారుడు బిక్కమొహం వేసి అక్కడినుంచి వెనుదిరిగాడు. సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి ఈ అనుభవం ఎదురైంది. నోటును తీసుకునేందుకు అందరూ నిరాకరిస్తుండటంతో.. డుమ్రా పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశాడు.

అయితే దీనిపై స్పందించిన సదరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ వాదన మరోలా ఉంది. ఈ విధంగా జరగడానికి వీలులేదని, ఏటీఎంలో భద్రపరిచే డబ్బును ప్రైవేట్ సంస్థ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేసి.. వాటికి సీల్ కూడా వేస్తామని సుధాంశు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications