Wife: ఆంటీని చంపేసి ఇంట్లోనే కట్టెలు పేర్చి నిప్పంటించిన భర్త, రాత్రి ఏం జరిగింది ?
ఆంటీని హత్య చేసిన ఆమె భర్త మరుసటి రోజు వరకు శవాన్ని ఇంట్లోనే పెట్టాడు. కొన్ని కర్రలు, చెక్కలు తీసుకెళ్లి ఇంటి ఆవరణంలో వేసి దాని మీద భార్య శవం పెట్టి నిప్పంటించాడు.
చంఢీగడ్/ పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగాకాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. కొడుకు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులు మాత్రమే ఇంటిలో ఉంటున్నారు. ఓ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చంపేశాడు. ఆంటీని హత్య చేసిన ఆమె భర్త మరుసటి రోజు వరకు శవాన్ని ఇంట్లోనే పెట్టాడు. కొన్ని కర్రలు, చెక్కలు తీసుకెళ్లి ఇంటి ఆవరణంలో వేసి దాని మీద భార్య శవం పెట్టి నిప్పంటించాడు. భార్య శవాన్ని ఇంట్లో కాల్చడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

దంపతులు హ్యాపీ
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ లోని పనియార్ గ్రామంలో సన్సార్ చంద్ (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 32 సంవత్సరాల క్రితం మహీంద్రో కౌర్ (55) అనే మహిళను సన్సార్ చంద్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సన్సార్ చంద్, మహీంద్రో కౌర్ చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

దంపతులు మాత్రమే ?
సన్సార్ చంద్, మహీంద్రో కౌర్ దంపతుల కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. సన్సార్ చంద్ కొడుకు హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సన్సార్ చంద్, మహీంద్రో కౌర్ దంపతులు మాత్రమే గ్రామంలోని ఇంటిలో ఉంటున్నారు. కొడుకు, కూతురు అప్పుడప్పుడు ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి కొన్ని రోజులు ఉండి మళ్లీ వెళ్లిపోతున్నారు.

భార్యను ఇంట్లోనే చంపేసిన భర్త
సన్సార్ చంద్, మహింద్రో కౌర్ దంతపలు మధ్య చాలాకాలం నుంచి ఓ విషయంలో గొడవలు పడుతున్నారని తెలిసింది. భార్య కౌర్ మీద అనుమానం పెంచుకున్న సన్సార్ చంద్ నిత్యం ఆమెతో గొడవపడి చితకబాదుతున్నాడని తెలిసింది. గురువారం రాత్రి ఇంటికి వెళ్లిన చంద్ అదే విషయంలో అతని భార్య కౌర్ తో గొడవ పెట్టుకున్నాడు. తరువాత సహనం కోల్పోచయిన సన్సార్ చంద్ పదునైన ఆయుధంతో అతని భార్య మహీంద్రో కౌర్ చంపేశాడు.

ఆంటీ శవానికి ఇంట్లోనే నిప్పంటించిన భర్త
భార్యను చంపేసిన సన్సార్ చంద్ ఆమె శవాన్ని ఇంట్లోనే పెట్టాడు. శుక్రవారం కొన్ని కట్టెలు, కర్రలు ఇంటికి తీసుకెళ్లాడు. కట్టెల మీద భార్య మహీంద్రో శవం పెట్టిన సన్సార్ చంద్ నిప్పంటిచాడు. శవం కాలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మహీంద్రో శవం అర్దం కాలిపోయింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సన్సార్ చంద్ ప్రతినిత్యం అతని భార్య మహీంద్రో మీద దాడి చేసేవాడని, గురువారం రాత్రి అలాగే దాడి చేంపేశాడని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. సన్సార్ చంద్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications