Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?
బెంగళూరు/విజయపుర/దుబాయ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు దంపతులు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య చాలా చిన్న వయసు కుర్రాడితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఆంటీ మోజులో పడిపోయిన యువకుడు ఆమె తప్పా తనకు వేరే ప్రపంచం లేదని అనుకున్నాడు. ఆంటీ ఎక్కడికి వెళితే అక్కడి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాడు. కుర్రాడు కదా అని అనుకుంటే తనకే యముడైనాడని అతనికి ఆంటీ దూరం అయ్యింది. ఆంటీ ఉంటున్న చోటకు వెతుక్కుంటూ వెళ్లిన యువకుడి మీద ఆమె కుటుంబ సభ్యులు 20 సార్లు బండరారితో దాడి చేసి అతి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

దుబాయ్ లో మొగుడు
కర్ణాటకలో బాగల్ కోటే లో సరోజా అనే మహిళ నివాసం ఉంటున్నది. బాబు (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సరోజా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు సరోజా, బాబు దంపతులు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగం చెయ్యడానికి సరోజా భర్త దుబాయ్ వెళ్లాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న సరోజా
బాగల్ కోటేలో మంజునాథ్ బాళప్ప జఖమండి అలియాస్ మంజునాథ్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భర్త దుబాయ్ వెళ్లిన తరవాత సరోజాకు మంజునాథ్ అపరిచయం అయ్యాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సరోజా ఆమె కంటే చాలా చిన్న వయసు కుర్రాడు అయిన మంజునాథ్ తో చనువు పెంచుకుని తరువాత అతనితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.

స్వర్గం చూపించిన ఆంటీ..... ఎంతకైనా ఓకే ?
సరోజా ఆంటీ మోజులో పడిపోయిన మంజునాథ్ ఆమె తప్పా తనకు వేరే ప్రపంచం లేదని అనుకున్నాడు. సరోజా ఆంటీ ఎక్కడికి వెళితే అక్కడి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని మంజునాథ్ వెళ్లాడు. రానురాను మంజునాథ్ నీ భర్త దుబాయ్ లో ఉన్నాడు కదా, నన్ను పెళ్లి చేసుకో అంటూ సరోజా ఆంటీ మీద ఒత్తిడి చేశాడు.

కుర్రాడు కదా అనుకుంటే.... బెంగళూరు పారిపోయిన ఆంటీ
తనకు వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని, నిన్ను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని సరోజా ఆమె బాయ్ ఫ్రెండ్ మంజునాథ్ కు చాలాసార్లు నచ్చచెప్పింది. అయితే మంజునాథ్ మాత్రం సరోజా ఆంటీని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కుర్రాడు కదా అని అనుకుంటే తనకే యముడైనాడని మంజునాథ్ కు దూరం అయిన సరోజా బెంగళూలోని కేపీ అగ్రహారలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

ఆంటీని వెంటాడిన ప్రియుడు
ప్రియురాలు సరోజా బెంగళూరు వెళ్లిపోయిందని తెలుసుకున్న మంజునాథ్ అతను బెంగళూరు వచ్చి ఓ హోటల్ లో రూమ్ తీసుకుని ఆమెను కలవడానికి ప్రయత్నించాడు. సరోజాకు ఫోన్ చేసి నిన్ను కలవాలని చెప్పాడు. ప్రియుడిని కలవడానికి సరోజా అంగీకరించలేదు. ఎలాగైనా సరోజా ఆంటీని కలవాలని మంజునాథ్ బెంగళూరులోనే వేచి చూశాడు.

రాత్రి ఏం జరిగిందంటే ?
మంజునాథ్ రాత్రి సరోజా ఆంటీ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో నీతో మాట్లాడాలని మంజునాథ్ సరోజాకు చెప్పాడు. మంజునాథ్ తో మాట్లాడటానికి సరోజా నిరాకరించింది. ఆ సందర్బంలో సరోజా బందువులు అక్కడికి వెళ్లారు. తరువాత మంజునాథ్ ను పట్టుకుని చితకబాదేశారు.

ప్రియుడి తల మీద 20 సార్లు సిమెంట్ ఇటుకతో ?
ఆ సందర్బంలో సరోజా బంధువులు ఆమె ప్రియుడు మంజునాథ్ ను కిందకు వేసి సిమెంట్ ఇటుకలు తీసుకుని అతని ముఖం గుర్తు పట్టకుండా 20 సార్లు దాడి చేసి దారుణంగా చంపేశారు. స్థానికులు హత్య జరిగిన వియషం తెలుసుకుని కేపీ అగ్రహార పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మంజునాథ్ శవాన్ని స్వాదీనం చేసుకున్నారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు మంజునాథ్ హత్య కేసులో భీమవ్వ, మహాదేవి, మంజు, కిరణ్, చెన్నప్ప, కాశీనాథ్ ను అరెస్టు చేశారు. అయితే మంజునాథ్ హత్యకు ప్రధాన కారణం అయిన సరోజా ఆంటీ మాత్రం తప్పించుకుంది, సరోజా కోసం గాలిస్తున్నామని కేపీ అగ్రహార పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications