Aunty: ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ?, నువ్వు ఏం చేస్తున్నావు ?, భార్య తల పగలగొట్టి పై నుంచి దూకేసి, రివర్స్ !

నాసిక్/ మహారాష్ట్ర: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా జీవించారు. 15 ఏళ్ల సంతోషంగా జీవించిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. రానురాను భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. భర్త డ్రైవర్ కావడంతో అతను ఎక్కువగా బయట ఉండటం, భార్య ఇంట్లోనే ఉండటంతో అతనికి ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో దంపతుల గొడవ పడుతున్నారు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త ఎప్పటిలాగే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నేను ఇంట్లో లేనిసమయంలో ఇంటికి ఎవరెవరు వచ్చారు ?, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్లావు ?, ఎవరితో తిరిగావు ? అంటూ భార్యను ప్రశ్నించాడు. కొంతసేపటి తరువాత పదునైన ఆయుధం తీసుకుని భార్యను చితకబాదేశాడు. భార్య చనిపోయింది అనుకున్న భర్త మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త ప్లాన్ రివర్స్ అయ్యి భార్య బతికిపోయింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలోని మస్రూల్ ప్రాంతంలో రాజు ఠాకూర్ అలియాస్ రాజు (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం రాజు ఠాకూర్ చందా (45) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజు ఠాకూర్, చందా దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

భర్త ట్రక్కు డ్రైవర్ కావడంతో అనుమానం

భర్త ట్రక్కు డ్రైవర్ కావడంతో అనుమానం

15 ఏళ్ల సంతోషంగా జీవించిన తరువాత రాజు, చందా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. రానురాను భార్య చందా మీద ఆమె భర్త రాజుకు అనుమానం మొదలైయ్యింది. రాజు ట్రక్కు డ్రైవర్ కావడంతో అతను ఎక్కువ రోజులు బయట ఉంటున్నాడు. రాజు భార్య చందా ఇంట్లోనే ఉండటంతో అతనికి ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.

ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ? ఏం చేస్తున్నారు

ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ? ఏం చేస్తున్నారు

ఇదే విషయంలో రాజు, చందా దంపతుల గొడవ పడుతున్నారు. పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చేసినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాజు ఎప్పటిలాగే అతని భార్య చందాతో గొడవ పెట్టుకున్నాడు. నేను ఇంట్లో లేనిసమయంలో ఇంటికి ఎవరెవరు వచ్చారు ?, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్లావు ?, ఎవరితో తిరిగావు ? అంటూ భార్య చందాను ప్రశ్నించాడు.

భార్య చనిపోయిందనే భయంతో భర్త ఆత్మహత్య

భార్య చనిపోయిందనే భయంతో భర్త ఆత్మహత్య

కొంతసేపు దంతపతులు ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రాజు పదునైన ఆయుధం తీసుకుని అతని భార్య చందా తల మీద చితకబాదేశాడు. భార్య చందా కుప్పకూలిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న రాజు మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త ప్లాన్ రివర్స్

భర్త ప్లాన్ రివర్స్

అయితే భర్త దాడిలో తీవ్రగాయాలైన చందా ప్రాణాలతో బయటపడింది. తీవ్రగాయాలై చందాను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు. దంపతులు వారి ఫ్లాట్ లో గొడవపడుతున్న విషయం స్థానికులు చెప్పారని, రాజు ప్లాన్ రివర్స్ కావడంతో అతని ప్రాణం పోయిందని, చందా చికిత్స పొందుతున్నదని మస్రూల్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+