Aunty: బెడ్ రూమ్ విషయాల్లో అత్త ఓవర్ యాక్షన్, అల్లుడికి కాలిపోయి ఏం చేశాడంటే ?, ఫ్రెండ్ ని వదల్లేదు !
చెన్నై: పెళ్లి చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అన్ని కుటుంబాల్లో ఉన్నట్లే దంపతుల కాపురంలో చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో బెడ్ రూమ్ విషయాల్లో కూడా భార్య తల్లి ఎక్కువగా జోక్యం చేసుకుని అల్లుడితో పంచాయితీలు పెట్టింది. భార్య, భర్తల మద్య లక్ష సమస్యలు ఉంటాయని, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని అల్లుడు అతని అత్తకు తేల్చి చెప్పాడు. అయితే అత్త పదేపదే జోక్యం చేసుకోవడంతో అల్లుడు రగిలిపోయాడు. రాత్రి పంచాయితీలు చెయ్యడానికి వచ్చిన అత్తను భార్య కళ్లముందే అడ్డంగా నరికి చంపేశాడు. పంచాయితీలు చెయ్యడానికి వచ్చిన స్నేహితుడి మీద కొడవలితో దాడి చెయ్యడం కలకలం రేపింది.

పారామెడికల్ ఉద్యోగం
తమిళనాడులోని నెల్లై జిల్లాలోని మూలైక్కరైపట్టిలోని అంబేద్కర్ వీధిలో రాజ్యలక్ష్మి (47) అనే మహిళ నివాసం ఉంటున్నది. పలయంకోటై ప్రభుత్వ ఆసుపత్రిలో పారామెడికల్ అసిస్టెంట్ గా రాజ్యలక్ష్మి ఉద్యోగం చేస్తున్నది. వేలాయుదం, రాజ్యలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె మాల అనే యువతి ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజ్యలక్ష్మి హ్యాపీగా జీవనం సాగిస్తోంది. రాజ్యలక్ష్మి భర్త వేలాయుదం మేస్త్రీగా పని చేస్తున్నాడు.

కూతురు, అల్లుడి హ్యాపీలైఫ్
రాజ్యలక్ష్మి ఆమె కూతురు మాలను అభిమన్యు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. మాలను పెళ్లి చేసుకున్న అభిమన్యు అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అన్ని కుటుంబాల్లో ఉన్నట్లే అభిమన్య, మాల దంపతుల కాపురంలో రానురాను చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. అభిమన్యు, మాలా దంపతుల మద్య ఎక్కువగా బెడ్ రూమ్ సమస్యలు ఉన్నాయని తెలిసింది.

ఎగేసుకుంటూ వెళ్లి ఓవర్ యాక్షన్ చేస్తున్న అత్త
కూతురు మాలకు, ఆమె భర్త అభిమన్యుకు గొడవలు జరుగుతున్నాయని రాజ్యలక్ష్మికి తెలిసింది. ఇదే సమయంలో భార్య మాలా తల్లి రాజ్యలక్ష్మి ఎక్కువగా జోక్యం చేసుకుని అల్లుడు అభిమన్యుతో పంచాయితీలు పెట్టింది. భార్య, భర్తల మద్య లక్ష సమస్యలు ఉంటాయని, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని అల్లుడు అభిమన్యు అతని అత్త రాజ్యలక్ష్మికి తేల్చి చెప్పాడు.

అత్త అల్లుడు ఢిష్యూం.... ఢిష్యూం
తన కాపురంలో అత్త రాజ్యలక్ష్మి పదేపదే జోక్యం చేసుకోవడంతో అల్లుడు అభిమన్యు రగిలిపోయాడు. రాత్రి పంచాయితీలు చెయ్యడానికి వచ్చిన అత్త రాజ్యలక్ష్మితో అభిమన్యు గొడవ పడ్డాడు. భార్య మాలా ఆమె తల్లి రాజ్యలక్ష్మి, భర్త అభిమన్యుకు సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో రాజ్యలక్ష్మి అల్లుడు అభిమన్యు మీద చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించింది.

అత్తను నరికి చంపిన అల్లుడు
గొడవ పెద్దది కావడంతో అభిమన్యు సహనం కోల్పోయాడు. ఇంట్లో ఉన్న కొడవలి తీసుకున్న అభిమన్యు అతని అత్త రాజ్యలక్ష్మి మీద దాడి చేశాడు. ఇదే సమయంలో పంచాయితీలు చెయ్యడానికి వెళ్లిన స్నేహితుడు అన్బులగన్ అడ్డు వెళ్లడంతో అతని మీద అభిమన్యు కొడవలితో దాడి చేశాడు. రాజ్యలక్ష్మిని ఆమె కూతురు మాల కళ్లముందే అల్లుడు అభిమన్యు అడ్డంగా నరికి చంపేశాడు.

దర్జాగా అల్లుడు పరార్
అత్త రాజ్యలక్ష్మిని దారుణంగా హత్య చేసిన అభిమన్యు అతని భార్య మాలా ముందే దర్జాగా పరారైనాడు. తీవ్రగాయాలైన అన్బలగన్ ను పాలయంకోటై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్నర్ స్టోన్ పోలీసులు కేసు నమోదు చేసి అభిమన్యు కోసం గాలిస్తున్నారు. ఇంటి గొడవలతో అల్లుడు అతని అత్తను దారుణంగా నరికి చంపడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications