కుంభమేళా పొడిగింపు - ప్రభుత్వం క్లారిటీ, మరో రికార్డు..!!
Mahakumbh Mela 2025: మహాకుంభమేళా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా లో పుణ్య స్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది.
కుంభమేళాకు భక్త జన వరద కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకూ 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచం లోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. జన వరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ కొనసాగనుంది. దా దాపు 45 రోజులపాటూ జరిగిన ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద సంగమంగా నిలిచింది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ముందుగా నిర్ణయించి న ప్రకారమే ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక.. ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు ప్రయాగ్ రాజ్ చేరుకు న్నారు. పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేలా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications