Vistara: రన్ వే పైకి వీధి కుక్క.. విమానాన్ని దారి మళ్లించిన అధికారులు..

రన్ వే పైకి వీధి కుక్క రావడంతో విమానం ల్యాండ్ కాకుండా తిరిగి వెళ్లిపోయిన ఘటన గోవాలోని విమానాశ్రయంలో జరిగింది. గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం రన్ వే పై వీధి కుక్కు కనిపించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులు విమానం పైలెట్ ను అప్రమత్తం చేశారు. దీంతో విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారని ఓ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. బెంగళూరు నుంచి సోమావారం మధ్యాహ్నం 12.55 గంటలకు విస్తార(Vistara) ఎయిర్ లైన్స్ చెందిన విమానం బయలుదేరింది.

అది 2 గంటలకు గోవాలో దిగాల్సి ఉంది. గోవా విమానాశ్రయంలో దిగడానికి పైలెట్ సిద్ధమయ్యాడు. ఏటీసీ అధికారులు రన్ వే పై కుక్కను గుర్తించారు. వెంటనే పైలెట్ కు సమాచారం ఇచ్చారు. కాసేపు వేచి చూడాల్సిందిగా కోరారు. అయితే పైలెట్ మాత్రం విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాడు. ఆ విమానం తిరిగి సాయింత్రం గోవాకు వెళ్లింది. 100 మందికి పైగా ప్రయాణికులతో విస్తారా విమానం తిరిగి సాయంత్రం 6.15 గంటలకు గోవాలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

Authorities diverted a flight after a stray dog found its way onto the runway at Goa airport

డబోలిమ్ విమానాశ్రయం రన్‌వేపై వీధికుక్క కనిపించడంతో పైలట్‌ను కొంతసేపు ల్యాండింగ్ అపండి అని అడిగారు. అయితే పైలెట్ బెంగళూరుకు తిరిగి రావడానికి ఇష్టపడినట్లు గోవా విమానాశ్రయం డైరెక్టర్ SVT ధనంజయరావు ఒక వార్తా సంస్థతో చెప్పారు. "రన్‌వేపై కొంత అడ్డంకి ఏర్పడింది. పైలట్‌ని కాసేపు ఆగాలని కోరారు. పైలట్లు సురక్షితంగా ఉండాలని.. మూలానికి తిరిగి వెళ్లాలని ఎంచుకున్నారు" అని రావు చెప్పారు. ఎయిర్ లైన్స్ చర్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు పడ్డారు.

ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, విమానాన్ని బెంగళూరుకు మళ్లించడంలో విమానయాన సంస్థ పాత్ర ఏమీ లేదని విస్తారా ప్రతినిధులు తెలిపారు. "గోవా విమానాశ్రయంలో రన్‌వే ఆంక్షల కారణంగా విమానం దారి మళ్లించాం. దురదృష్టవశాత్తు, ఇటువంటి పరిస్థితులు మా నియంత్రణలో లేవు" అని ఒక అధికారి చెప్పారు. కొందరు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా మోపా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌కు దగ్గరగా ఉన్న ఎండు గడ్డిలో సోమవారం సాయంత్రం 5 గంటలకు మంటలు చెలరేగాయి. అయితే మంటలు విమాన కార్యకలాపాలను ప్రభావితం చేయలేదని GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+