Ayodhya : ఈ నెల 22న వాల్మీకి మహర్షి ఎయిర్‌‌‌‌పోర్టుకు 100 చార్టర్డ్‌‌ ఫ్లైట్స్ ...

అయోధ్య‌లో శ్రీరాముడి ప్ర‌తిష్టాప‌నకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి మ‌రికొన్ని రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. జ‌న‌వ‌రి 22న అయోధ్య రామాల‌య ప్రారంభానికి స‌న్నాహాలను పూర్తిచేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే అతిర‌థ మ‌హారథులంద‌రికీ ఆహ్వానాలు అందాయి. అయోధ్య ఉద్య‌మంలో మ‌ర‌ణించిన క‌ర‌సేవ‌కుల కుటుంబ‌స‌భ్యులకు ఆహ్వానాలు అందిన‌ట్లు తెలుస్తున్నాయి. అయోధ్య రామ‌మందిర ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 22న వాల్మీకి మ‌హ‌ర్షి ఎయిర్‌పోర్టుకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా గురువారం అహ్మ‌దాబాద్‌, అయోధ్య మ‌ధ్య డైరెక్ట్ ఫ్లైట్ స‌ర్వీసు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించ‌డం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యూపీ సిఎం కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ..అయోధ్య రామాల‌యం ప్రారంభానికి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ని, అయోధ్య‌లో కొత్తగా నిర్మించిన వాల్మీకి మ‌హ‌ర్షి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఈ నెల 22న 100 చార్ట‌ర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయ‌ని తెలిపారు. ఈ విమానాల ల్యాండింగ్‌తో ఎయిర్‌పోర్టు సామ‌ర్థ్యాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపారు.

 Ayodhya: 100 chartered flights to Valmiki Maharshi Airport on 22nd of this month...

ప్ర‌ముఖుల కుటుంబాల‌కు అందిన అయోధ్య ఆహ్వాన ప‌త్రిక‌లు : ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి యూపీ ముఖ్యమంత్రి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు నాల్గవ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయోధ్యను అహ్మదాబాద్‌‌‌‌తో కనెక్ట్ చేయడానికి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఇక‌, ఈ నెల 22న జ‌రిగే మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీ రామ్ తదితరుల కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా అయోధ్య ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను అంద‌జేశారు. ఇక‌, బిజెపి కురువృద్ధుడు ఎల్‌‌కే అద్వానీ కూడా అయోధ్య రామాల‌య వేడుకలకు హాజరుకానున్నారని స‌మాచారం. ఇక ఈ వేడుక‌కు గుజ‌రాత్ నుంచి ప్ర‌త్యేకంగా 500 కిలోల బ‌రువు ఉన్న డోలు ఇప్ప‌టికే అయోధ్యకు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+