అయోధ్య: రామ మందిర భూమి పూజకు అతిథులు వీరే, వేదికపై ప్రధాని మోడీతోపాటు నలుగురే
లక్నో: మరో రెండ్రోజులే సమయం ఉండటంతో అయోధ్యలో రామ మందిర భూమి పూజ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథుల ఆహ్వానం, ఇతర ఏర్పాట్లపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరాలను వెల్లడించింది. మొత్తం 175 మంది ప్రముఖులతోపాటు, 135 మంది సాధువులను, అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది.

మోడీతోపాటు ఆ నలుగురే వేదికపైన..
కరోనా కారణంగానే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించలేకపోయామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ తోపాటు రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ వేదిక పంచుకుంటారని వివరించింది.
మొదట హనుమంతుని దర్శనం..
ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా హనుమాన్ మందిరాన్ని దర్శించుకుని, అక్కడ్నుంచి రామ జన్మభూమిలోని రామ్‌లల్లాలో పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. కాగా, భూమి పూజ కోసం 2వేల తీర్థక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, 100 నదుల నుంచి నీరు తెప్పించినట్లు తెలిపింది.

రామ భక్తులకు పిలుపు..
దేశ వ్యాప్తంగా ఉన్న అనేకమంది సాధువులు ఎన్నో రకాల పవిత్ర వస్తువులను భూమి పూజ కోసం పంపినట్లు తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెప్పింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని గ్రామాలు, నగరాల్లో భజనలు, కీర్తనలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ట్రస్ట్ పిలుపునిచ్చింది. కాగా, భూమి పూజ నేపథ్యంలో పోలీసులు అయోధ్యలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Recommended Video

రామ మందిర భూమి పూజకు వెండి తమలపాకులు
ఇది ఇలావుండగా, రామ మందిర భూమి పూజ కోసం కాశీ నుంచి వెండి తమలపాకులు తరలివచ్చాయి. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందినవారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరిసియా వీటిని వేద పండితులకు అందజేశారు. వారు ఈ తమలపాకులను తీసుకుని అయోధ్యకు బయల్దేరివెళ్లారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications