క్రిక్కిరిసిన అయోధ్యాపురి: ఆ శుభదినం నేడే: 22కు బదులుగా
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమైన రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో రామ్ లల్లాను దర్శించుకుంటోన్నారు. అయోధ్యాపురి మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటోన్నారక్కడ. గడ్డ కట్టించే చలిని సైతం లెక్కచేయట్లేదు.
గత ఏడాది జనవరి 22వ తేదీన రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందన. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే.
నేటితో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏడాది పూర్తయింది. నిజానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. జనవరి 22వ తేదీ నాడే అయినప్పటికీ- 10 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దీనికి కారణాలు లేకపోలేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. అప్పటి ప్రాణప్రతిష్ఠ తిథి, ముహూర్త లగ్నం ప్రకారం చూసుకుంటే ఆ శుభదినం నేడే.
తొలి ఏడాది సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్యానగరం నిండిపోయింది. బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీర్చినిల్చున్నారు. ఆరు డిగ్రీల చలిని కూడా వారు లెక్కచేయలేదు.
ఈ తెల్లవారు జామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది.












Click it and Unblock the Notifications