సిల్వర్ స్క్రీన్‌పై అయోధ్య రాముని ఉత్సవం...ధరెంతో తెలుసా..?
జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ మహత్తర కార్యానికి మరికొన్ని గంటలే ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రితో పాటు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహరథులందరూ విచ్చేయనున్నారు. అయితే, అయోధ్య రాముని ఉత్సవాన్ని సిల్వర్ స్ర్కీన్‌పై చూడొచ్చు. ప్రముఖ మల్టీఫ్లెక్స్ సంస్థలు, పీవిఆర్, ఐనాక్స్‌లు భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించనున్నాయి. చాలామంది ఈ మహోజ్వల ఘటనను టీవీల్లో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది వెండితెరపై కూడా వచ్చే అవకాశం ఉంది.
సిల్వర్ స్ర్కీన్‌పై కేవలం 100 రూపాయల టికెట్‌తోనే అయోధ్య ఉత్సవాన్ని వీక్షించొచ్చు. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం కల్పించనున్నారు. పీవీఆర్, ఐనాక్స్ ఈ ఏర్పాట్లను చేయనున్నాయి. అయోధ్య వేడుక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం ఉండనుంది. దీనికి టికెట్ ధర రూ. 100 మాత్రమే ఉండనుంది. ఇది సినిమా టిక్కెట్ ధర మాత్రమే కాదు, ఇందులో కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ కాంబో వంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. ఈ మహత్తర కార్యక్రమానికి సీని ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ దంపతులు, మోహన్ బాబు, ప్రభాస్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్ వంటి వారు హాజరవనున్నారు. అయోధ్య రాముడి వేడుకలో వీరంతా ప్రత్యక్ భాగస్వాములు కానున్నారు. వీరితో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖులు కూడా విచ్చేయనున్నారు.

పీవీఆర్, ఐనాక్స్ లు గతంలో కూడా ఇలాంటి ప్రత్యక్ష ప్రసారాలను అందించాయి. వన్డే ప్రపంచ కప్ మ్యాచల్‌ను లైవ్ ప్రసారం చేశాయి. అయోధ్య రాముని ఉత్సవాన్ని చూడాలని ప్రతిఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వెండితెరపై ఈ వేడకను చూసేందుకు అందరికీ అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా వివరించారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్ సైట్లలోనూ, అలాగే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లోనూ అయోధ్య రాముడి ఉత్సవ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications