అయోధ్య రామమందిరంలో కాశ్మీరీ వ్యక్తి నమాజ్..?
అయోధ్యలోని రామమందిరం కాంప్లెక్స్ లో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కాశ్మీరీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నమాజ్ చేసేందుకు ప్రయత్నించగా భక్తులు నినాదాలు చేసిన నేపథ్యంలో అక్కడి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అయోధ్యలోని రామమందిరం హిందువులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. నిత్యం లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే తాజాగా కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి అయోధ్యలోని రామమందిరం కాంప్లెక్స్ లో నమాజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఇది చూసిన అక్కడి భక్తులు అతడ్ని అడ్డుకుంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నిందితుడు కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాకు చెందిన 55ఏళ్ల అహ్మద్ షేక్ గా పోలీసులు గుర్తించారు. అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, దర్శనం తర్వాత సీతా రసాయి ప్రాంతం వద్ద నమాజ్ చేయడానికి సిద్ధమవుతుండగా అతన్ని స్థానిక భక్తులు గుర్తించారు. అహ్మద్ షేక్ చర్యలను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని.. విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి నినాదాలు చేశాడని కొన్ని వర్గాలు పేర్కొన్నప్పటికీ, అధికారులు ధృవీకరించలేదు. దర్యాప్తు, నిఘా ఏజెన్సీలు అతని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నాయి.
అతను అయోధ్యకు ఎందుకు వచ్చాడు..? ఇతరుల ప్రమేయం ఉందా..? అనే దానిపై అధికారులు అహ్మద్ షేక్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక తనిఖీలలో అతని వద్ద జీడిపప్పు, ఎండు ద్రాక్ష లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తాను అజ్మీర్ వెళుతున్నట్లు దర్యాప్తు అధికారులకు అహ్మద్ షేక్ చెప్పినట్లు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటన నేపథ్యంలో రామమందిర సముదాయంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీసు అధికారులు, నిఘా ఏజెన్సీలు సమీక్షిస్తున్నాయి. అయితే జిల్లా యంత్రాంగం, రామమందిర ట్రస్టు ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

మరోవైపు మకర సంక్రాంతి ఉత్సవాలకు అయోధ్య సిద్ధమవుతోంది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన ఉత్సవం రెండో వార్షికోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications