• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

134 ఏళ్ల వివాదానికి పరిష్కారం:స్వయంగా పర్యవేక్షించిన సీజేఐ:రికార్డు స్థాయిలో విచారణ..ఏకగ్రీవ తీర్పు

|

అయోధ్య వివాదం. దేశ రాజకీయాల్లో అతి సున్నితంగా మారిన వ్యవహారం. దీని పైన దాదాపు 134 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పరమైన వివాదం. అనేక కీలక పరిణామాలకు కేంద్రంగా మారిన అంశం. దీని పైన అనేక కేసులు..మలుపులు..తీర్పులు. కానీ, సమస్య మాత్రం పరష్కారం కాలేదు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు..అందునా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ కేసు పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

ఏకంగా 40 రోజుల పాటు వాదనలు విన్నారు. చివరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్‌, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లు ఏకాభిప్రాయంతో ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఇచ్చారు.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

స్వయంగా రంగంలోకి సీజేఐ..

స్వయంగా రంగంలోకి సీజేఐ..

ఇక నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అందుకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవ చూపి మరీ ప్రయత్నాలు సాగించారు. భారత దేశ సమగ్రతను కాపాడటం కోసం, మతతత్వ ఘర్షణలకు చోటు లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకున్న తర్వాతనే తీర్పు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్న ధర్మాసనం ఆ మేరకే తీర్పును వెల్లడించింది.

సీజేఐ స్వయంగా ఉత్తరప్రదేశం ఉన్నతాధికారులను పిలిపించి అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపైన స్వయంగా సమీక్షించారు. ఎటువంటి ఘర్ణణలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్న తరువాతనే ఈ సున్నితం అంశం మీద తీర్పు ఇవ్వాలని భావించిన ఆయన స్వయంగా పరిస్థితి సమీక్షించారు. ఇదే సమయంలో కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మత సంఘాల పెద్దలు సైతం శాంతి..సంయమనం పాటించాలని కోరారు. ఫలితంగా ఈ చారిత్రాత్మక తీర్పు వెల్లడైంది.

 చారిత్రక తీర్పులో సీజేఐ కీలక పాత్ర..

చారిత్రక తీర్పులో సీజేఐ కీలక పాత్ర..

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ అయోధ్య కేసుకు సంబంధించి ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్నారు.నవంబర్ 18, 1954 న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్‌లో చేరారు. గౌహతి హైకోర్టుతో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన 2001 లో గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

జస్టిస్ రంజన్ గొగోయ్

జస్టిస్ రంజన్ గొగోయ్

2012 , ఏప్రిల్ 23 న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కేసు తీర్పు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఈ కేసు మాత్రమే కాదు..మరిన్ని వివాదాస్పద కేసుల విషయంలోనూ తీర్పుల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

సుప్రీంలో రికార్డు స్థాయిలో విచారణ..

సుప్రీంలో రికార్డు స్థాయిలో విచారణ..

2019 ఆగస్టు 1వ తేదీన అయోధ్య స్థల వివాదం కేసులో వాదనలు వినడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటయింది. ఇక దీనిలో సభ్యులుగా జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ డి వై చంద్ర చూడ్ ఉన్నారు. అయితే ఆ తర్వాత 2019 జనవరి 25వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం పునర్వ్యవస్థీ కృతమైంది. ఆ తరువాత స్థానంలో 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ సాగిన అయోధ్య వివాదం రికార్డులకెక్కింది.

40 రోజుల సుదీర్ఘ వాదనలు

40 రోజుల సుదీర్ఘ వాదనలు

రాజ్యాంగ సున్నితమైన అంశంపై 40 రోజుల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది.చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్‌, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లు ఈ కేసుకు సంబంధించిన ధర్మాసనం సభ్యులుగా వ్యవహరించారు. ఈ ధర్మాసనం సున్నిత..సుదీర్ఘ కాలం సాగిన ఈ 148 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించి చరిత్రలో నిలిచారు.

English summary
Ayodhya Verdict:CJI key role in Ayodhya case judegent. CJI personally called UP officers and conucted review on UP ground level situation. After day by day arguments Supreme court bench given historical hudgement for 148 Years long pedning sesitive dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X