అయోధ్య క్రెడిట్ అద్వానీ, అశోక్ సింఘాల్‌కే దక్కుతుంది : ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త
అయోధ్య వివాదంలో తీర్పు హిందువులకు సానుకూలంగా రావడానికి రాజకీయ కురువృద్దుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానితో పాటు విశ్వహిందూ పరిషత్ నేత స్వర్గీయ అశోక్ సింఘాల్‌లు కారణమని మాజీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త, కే.ఎన్ గోవిందాచార్య కొనియాడారు. సుప్రీం తీర్పు క్రెడిట్ వారికే చెందుతుందని అన్నారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. రామమందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను సుప్రీం కోర్టు తొలగించిందని ఆయన అన్నారు. ఇక మందిర నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
అయోధ్య, సుప్రీం తీర్పుపై నితీష్; కేజ్రీవాల్, కమల్ నాథ్ కామెంట్
కాగా గోవిందాచార్య 1990 సంవత్సరంలో అద్వానీ రామజన్మభూమి కోసం చేపట్టిన రథయాత్రలో కే.ఎన్ గోవిందాచార్య ప్రధాన పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలోనే అద్వాని రథయాత్ర ఒక కారణమని అన్నారు. అయోధ్య నిర్మాణం కోసం అద్వాని చాల కృషి చేశారని చెప్పారు.

తీర్పుపై పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన దేశం మొత్తం రానున్న రోజుల్లో రామమందిర నిర్మాణం తర్వాత రామరాజ్యంగా మారాలని కోరారు. ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగం చేశారని, చాలమంది అనేక రకాలుగా రామజన్మభూమి ఉద్యమ నిర్మాణంలో పాలు పంచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.