ayodhya verdict:1934లో అల్లర్లు, 1949లో ఆటంకాలు.. అయోధ్య తీర్పులో ప్రస్తావించిన రాజ్యాంగ ధర్మాసనం

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు చాలా అంశాలను వివరించింది. అయోధ్య భూమికి సంబంధించి 1934 అల్లర్లు, 1949 ఆటంకాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇంతకీ 1939, 1949లో ఏం జరిగింది. తన తీర్పులో సుప్రీంకోర్టు ఏ అంశాలను వివరించింది. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

15వ శతాబ్ధం నుంచి వివాదం..

15వ శతాబ్ధం నుంచి వివాదం..

అయోధ్య భూ వివాదం శతాబ్ధాల నుంచి ఉంది. 1528లో బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ మసీదును నిర్మించాడు. తర్వాత హిందువులు రాముని విగ్రహాం ఉందని పూజలు కూడా చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. 1934లో అయోధ్యలో ఉన్న మసీదు దెబ్బతినడంతో వివాదం చెలరేగింది.

ఇదీ కారణం..

ఇదీ కారణం..

గోవుల వల్ల మసీదు కాస్త దెబ్బతింది. ఈ విషయాన్ని కొందరు ప్రభుత్వానికి తెలియజేశారు. బ్రిటిష్ ప్రభుత్వం హిందువులకు జరిమానా విధించింది. రూ.84 వేల పెద్దమొత్తం కట్టాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఓ హిందు మహిళ ఆ నగదు కట్టడంతో గొడవ సద్దుమణిగింది. రూ.84 వేల నగదును దెబ్బతిన్న మసీదును పునర్ నిర్మించేందుకు ఉపయోగించారు.

రాముని విగ్రహాం

రాముని విగ్రహాం

తర్వాత 1949లో రాముని విగ్రహాన్ని అయోధ్య మందిరం మధ్యలో పెట్టారు. కానీ దానిని ఎవరో తీసేశారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై రామ్ దేవ్ పేర్కొన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఫైజాబాద్ మేజిస్ట్రేట్ మార్కండేయ్ సింగ్ సీఆర్పీసీ 145 సెక్షన్ కింద నోటీసులు జారీచేశారు. అనుమానం ఉన్న హిందువులు, ముస్లింలు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు.

తెరపైకి నిర్మోహి అకాడా..

తెరపైకి నిర్మోహి అకాడా..

ఇక 1950 నుంచి అయోధ్య వివాదాస్పద స్థలంలో విగ్రహాలు పెట్టడం ప్రారంభించారు. దీనిని ఆధారంగా చేసుకొని నిర్మోహి అకాడా కేసు నమోదు చేసింది. మసీదు కన్నా ముందు ఇక్కడ ఆలయాలు ఉండేవని చెప్పారు. తర్వాత అకాడా రంగంలోకి దిగడంతో సున్నీ వక్ఫ్ బోర్డ్ కూడా పిటిషన్ వేసింది. బాబ్రీ మసీదు స్తలాన్ని తమకు అప్పగించాలని కోరింది. అప్పటి నుంచి రామజన్మ భూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై వివాదం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+