Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya verdict: కేసులో పిటిషనర్‌గా ఉన్న రామ్‌లల్లా ఎవరు..?

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో చారిత్రాత్మక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. వివాదాస్పదంగా ఉన్న భూమిని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు చెందుతుందని తీర్పు చెప్పింది. అదేసమయంలో మసీదు కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. అయితే ఈ కేసులో వివాదాస్పదంగా ఉన్న భూమి రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే కేసులో పిటిషనర్‌గా ఉన్న రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఎవరు..?

 రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఎవరు..?

రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఎవరు..?

అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. వివాదాస్పదంగా ఉన్న భూమి రామ్‌లల్లాకే చెందుతుందని వెల్లడించింది. రామ్ లల్లా విరాజ్‌మాన్ ఈ కేసులో పిటిషనర్‌గా ఉంది. అయితే రామ్‌లల్లా విరాజ్‌మాన్ రాముడి విగ్రహం. ఇక కేసులో రామ్‌లల్లా తరుపున సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అయితే ఆలయంలో దేవుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి విగ్రహం ఈ కేసులో ఉండటం ఆసక్తికరంగా మారింది. రామ్‌లల్లా కేసుతో ముడిపడి ఉండటమేంటంటూ గతంలో అలహాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రశ్న తలెత్తింది.

దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చు

దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చు

అయితే వివాదాస్పదంగా మారిన భూమిపై రాముడి విగ్రహంకు ఉన్న హక్కులను గురించి కూడా సుప్రీం కోర్టు గతంలో ప్రస్తావించింది. ఆలయాలు, లేదా అందులో ఉన్న దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చని చట్టంలో ఉంది. అయితే ఆలయాలు వాటి ఆస్తులను చాలా సందర్భాల్లో ట్రస్టీలే నిర్వహిస్తూ ఉంటారు. అంటే అయోధ్య కేసులో కూడా డీడ్ విగ్రహంపైనే ఉంటుందనేది స్పష్టమవుతోంది. అందుకే కేసులో పిటిషనర్‌గా విగ్రహం కూడా ఉంది. ఇక అయోధ్య కేసులో రామ్‌లల్లా మైనర్‌గా చూస్తున్న నేపథ్యంలో గార్డియన్‌ ఈ కేసులో కోర్టుకు హాజరవుతూ వచ్చారు.

 పిటిషనర్ కేవలం మనుషులే ఉండక్కర్లేదు

పిటిషనర్ కేవలం మనుషులే ఉండక్కర్లేదు


ఒక కేసులో పిటిషనర్ అయి ఉండాలంటే కేవలం మనుషులు మాత్రమే ఉండక్కర్లేదని ఒక వస్తువు తరపున చట్టపరంగా మరో వ్యక్తి ఉండొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంటోంది. ఇక క్లుప్తంగా చెప్పాలంటే పిటిషనర్ మనిషే అయి ఉండాల్సిన పనిలేదని వస్తువైనా, లేదా ప్రాణంలేనిదైనా ఉండి దాని తరపున ఉన్న వారిని ఎవరినైనా కోర్టు గుర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. చట్టపరంగా అన్నిటికీ అర్హుడైతే ఒక వ్యక్తికి ఆస్తులను పొందే హక్కు ఉంటుంది. కానుకలు పొందొచ్చు. అదే సమయంలో ఏదైనా లిటిగేషన్లు ఉత్పన్నమైతే వస్తువులపై వ్యక్తి కేసు వేయొచ్చు.

 గార్డియన్ కింద పరిగణించే కోర్టులు

గార్డియన్ కింద పరిగణించే కోర్టులు

హిందూ చట్టం ప్రకారం విగ్రహాలు కూడా చట్టపరిధిలోకి వస్తాయని ఉంది. ఇందులో భాగంగానే శ్రీరాముడి విగ్రహం కూడా అయోధ్య కేసులో చట్టపరమైన వ్యక్తికిందనే ట్రీట్ చేయడం జరుగుతోంది. హిందూ విగ్రహాలు చట్టపరిధిలోనే ఉంటాయని కోర్టులు గుర్తిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహం బాగోగులు ఎవరైతే చూస్తున్నారో అట్టివారిని గార్డియన్‌ లేదా మేనేజర్‌గా కోర్టులు పరిగణిస్తున్నాయి. ఇక అయోధ్యకేసులోని భూమి శ్రీరాముడికి చెందినది అని తీర్పు రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన భూమిపై అన్ని హక్కులు ట్రస్టుకు ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+