ఆటకత్తె: జయప్రదపై నోరు పారేసుకున్న ఆజంఖాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయప్రదపై నోరు పారేసుకున్నారు. నాచే గానే వాలీ (ఆడిపాడేది) అంటూ జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అతను వేధించాడు, పద్మావత్‌లో ఖిల్జీలాంటివాడు: జయప్రద

పద్మావత్ సినిమా చూసినప్పుడు ఖిల్జీ పాత్ర ఆజంఖాన్‌ను గుర్తు చేసిందని జయప్రద వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆజంఖాన్ జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Azam Khan gives it back on Jaya Prada's 'Khilji' jibe

పద్మావత్ చిత్రం వచ్చిందని, ఖిల్జీ పాత్ర చెడ్డదని కూడా తాను విన్నానని, అయితే ఖిల్జీ రాక ముందే పద్మావతి ప్రాణత్యాగం చేసిందని అంటూ ఇప్పుడు ఓ మహిళ అందులోనూ ఓ డ్యాన్సర్ తనపై వ్యాఖ్యలు చేస్తోందని ఆజంఖాన్ అన్నారు.

ఆ డ్యాన్సర్ ఆటపాటలు చూస్తూ కూర్చుంటే రాజకీయాలపై తాను ఎలా దృష్టి పెట్టగలనని అన్నారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సందడి చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Uttar Pradesh minister and Samajwadi Party leader Azam Khan has hit back at former party colleague Jaya Prada, by saying that when would he have time for politics if he responds to “naachne gaane waali”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి