Baba ka Dhaba: ఆత్మహత్యకు యత్నం -మద్యంతో నిద్రమాత్రలు మింగిన కాంత ప్రసాద్

బాబా కా ధాబా.. కరోనా విలయ వార్తలను ఫాలో అవుతున్నవారికి పరిచయం అక్కర్లేని పేరిది. దేశరాజధాని ఢిల్లీలో మాల్వియా నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన చిన్న డబ్బా కొట్టునే ధాబాగా నడుపుకొనే వృద్ధ దంపతులు కాంత ప్రసాద్, బదామీ దేవి గురించి మనందరికీ తెలిసిందే. కడు పేదరికం నుంచి రాత్రికి రాత్రే సోషల్ స్టార్లుగా ఎదిగి, అంతే వేగంగా మళ్లీ దిగజారిపోయిన బాబా కా ధాబా యజమాని కాంత ప్రసాద్ అనూహ్య చర్యకు ఒడిగట్టాడు. వరుస కష్టాల నేపథ్యంలో ఆత్మహత్యయత్నం చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసుల వివరణ ఇది..

కకరోనా మహమ్మారి మొదటి దశలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సందర్భంగా వార్తల్లోకి ఎక్కిన బాబా కా ధాబా యజయాని కాంత ప్రసాద్ గురువారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిన్న రాత్రి మద్యం సేవించి, దాంతోపాటే గుప్పెడు నిద్రమాత్రలు మింగేశాడు. ఇంట్లో అచేతనంగా పడిఉన్న అతణ్ని కుటుంబీకులు సర్దాఫ్ గంజ్ ఆస్పత్రికి తరలించారు.

Baba ka Dhaba owner Kanta Prasad attempts suicide, admitted to hospital in Delhi

బాబా కా ధాబా ఫేమ్ కాంత ప్రసాద్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారిన సర్దాఫ్ గంజ్ ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఏం జరిగింది, ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన వివరాలను కాంతాప్రసాద్‌ కొడుకు కరణ్ పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం బాబా కా దాబా యజమాని స్పృహలో లేరని, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారని పోలీస్ అధికారి అతుల్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు.

ఏడాదిన్నర కిందట, యూట్యూబర్‌ గౌరవ్‌ వాసన్‌ చేసిన వీడియోతో బాబా కా ధాబా వెలుగులోకి రావడం తెలిసిందే. కరోనా విలయ కాలంలో బాధపడుతోన్న ఆ వృద్ధ దంపతులకు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. అయితే, తనకొచ్చిన డబ్బుల్ని గౌరవ్ నొక్కేశాడని కాంత ప్రసాద్ ఆరోపించడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం జరిగింది. దాతల నుంచి వచ్చిన డబ్బుతో కాంత ప్రసాద్ దంపతులు కొత్తగా రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. కానీ అనతికాలంలోనే అది నష్టాల్లో కూరుకుపోవడంతో, మళ్లీ వారు రోడ్డు పక్కనున్న ధాబాకు మళ్లారు. అంతలోనే కాంత ప్రసాద్ ఆత్మహత్యయత్నం వార్త అందరినీ కలవరపెడుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+