Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ మంత్రి తనయుడికి గాలం- సీట్ కన్‌ఫర్మ్

Maharashtra Assembly elections 2024: దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. ఈ రెండు చోట్లా నామినేషన్ల పర్వానికి తెర లేచింది.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.

Baba Siddique son Zeeshan Siddiqui joined Ajit Pawar led NCP set to contest from Bandra East

ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా.

ఈ పరిస్థితుల మధ్య- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)లో అనూహ్య చేరిక సంభవించింది. కొద్దిరోజుల కిందటే దారుణ హత్యకు గురైన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ తనయుడు, కాంగ్రెస్ మాజీ శాసన సభ్యుడు జీషాన్ సిద్ధికీ అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరారు.

ఈ ఉదయం ముంబైలో ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం అధినేత అజిత్ పవార్‌ను ఆయన నివాసంలో కలిశారు. పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అజిత్ పవార్. పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డు, బీ ఫామ్‌ను అందజేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జీషాన్ సిద్ధికీకి వాంద్రే (బాంద్రా) ఈస్ట్ నియోజకవర్గం టికెట్‌ను ఇచ్చారాయన. ఈ నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2019 నాటి ఎన్నికల్లో జీషాన్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు.

తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ శివసేన (ఉద్ధవ్ థాకరే)కు కేటాయించిందని, ఇది బాధ కలిగించిందని జీషాన్ వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ నాయకులు కొద్ది రోజులుగా తనను సంప్రదిస్తూనే ఉన్నారని, మరో స్థానంలో పోటీ చేసే అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చారని, దాన్ని తాను నమ్మట్లేదని చెప్పారు. అందుకే అజిత్ పవార్ వర్గంలో చేరినట్లు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+