దొంగబాబా సెక్స్ రాకెట్! రాజకీయ నాయకులు, అధికారులకు అమ్మాయిల సరఫరా!
అత్యాచారం కేసులో అరెస్టయిన నకిలీబాబా సియారామ్ దాస్ కేసులో... మరికొన్ని నిజాలు బయటికొచ్చాయి. పోలీసులు తీగలాగితే బాబా కీచకపర్వమంతా డొంకలా కదులుతోంది.
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో అరెస్టయిన నకిలీబాబా సియారామ్ దాస్ కేసులో... మరికొన్ని నిజాలు బయటికొచ్చాయి. పోలీసులు తీగలాగితే బాబా కీచకపర్వమంతా డొంకలా కదులుతోంది. సియారామ్ దాస్ తన ఆశ్రమంలో నడుపుతున్న బాలికల పాఠశాలను కూడా తన సెక్స్ రాకెట్ కోసం వినియోగించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అతడి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులపై కూడా నిత్యం అత్యాచారాలు జరిగినట్టు ఇటీవల అతడి చెర నుంచి బయటపడిన బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. సియారామ్ బాబా బాలికలను రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కూడా సరఫరా చేసేవాడని పేర్కొంది.

గత ఎనిమిది నెలలుగా ఓ యువతిని చెరబట్టి అత్యాచారం చేసిన కేసులో సియారామ్ బాబా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె ఎలాగోలా బాబా మొబైల్ ఫోన్ చేజిక్కించుకుని ఆశ్రమం నుంచి పోలీసులకు ఫోన్ చేయడంతో అతడి దారుణాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నకిలీబాబాపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు యూపీలోని సీతాపూర్ పోలీసులు వెల్లడించారు. అయితే తనపై ఆరోపణలు గుప్పిస్తున్న యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదనీ.. అసలు తానెప్పుడూ ఆమెను చూడలేదని సియారామ్ పేర్కొనడం గమనార్హం.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications