బాబ్రీ మసీదు వివాదం: పబ్లిక్ టాయిలెట్‌కు 'బాబర్' పేరు!

'బాబర్' పేరు చుట్టూ మొదలైన వివాదం పశ్చిమ బెంగాల్ నుంచి ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాకు చేరుకుంది. ఇక్కడ బీజేపీకి చెందిన ఓ మండల అధ్యక్షుడు ఏకంగా ఓ పబ్లిక్ టాయిలెట్‌కు 'బాబర్' పేరు పెట్టి వివాదాన్ని మరింత రాజేశారు. అశోక్‌నగర్ పట్టణంలో బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఓ పబ్లిక్ టాయిలెట్‌కు బీజేపీ మండల అధ్యక్షుడు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బబ్లూ యాదవ్ 'బాబర్ టాయిలెట్' అని పేరు పెట్టారు. దానిపై పేరు ఉన్న పలకను కూడా అంటించారు.

'బాబర్ టాయిలెట్' అని ఎందుకు పేరు పెట్టారంటే?
తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు బబ్లూ యాదవ్ స్పష్టం చేశారు. ఆయన దీనికి గల కారణాన్ని వివరిస్తూ... "భారతదేశం మహారాణా ప్రతాప్, శివాజీ వంటి గొప్ప వీరులకు జన్మనిచ్చిన భూమి. బాబర్ ఒక దండయాత్రకారుడు. అతను హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. మన దేశాన్ని దోచుకున్నాడు. అలాంటి దండయాత్రకారుడిని గొప్పగా కీర్తించడాన్ని, అతనిపై పొగడ్తలను కురిపించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం." అని బబ్లూ యాదవ్ పేర్కొన్నారు. అందుకే బాబర్ పేరు మీద మసీదులు కాకుండా.. ఈ టాయిలెట్ పేరు ఉండాలని తాము భావించామని, అందుకే దీనికి 'బాబర్ టాయిలెట్' అని పేరు పెట్టినట్లు బబ్లూ యాదవ్ గట్టిగా వాదించారు.

Babri Masjid Controversy Public Toilet Named After Babur Sparks Political Uproar in Madhya Pradesh

నిరసనకు కారణం ఏమిటి?
ఈ వివాదానికి మూలం ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక సంఘటన కావడం విశేషం. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజున, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ కొత్త బాబ్రీ మసీదుకు శంకుస్థాపన చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యపై ఆయనను బహిష్కరించింది. అయినప్పటికీ, హుమాయున్ కబీర్ బెల్డంగాలో మసీదుకు పునాది వేశారు. ఈ చర్యను దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ నిరసన సెగ ఇప్పుడు అశోక్‌నగర్ జిల్లాకు కూడా తాకి పబ్లిక్ టాయిలెట్‌కు 'బాబర్' పేరు పెట్టడం ద్వారా వ్యక్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+